Monday, February 28, 2011

శివాభిశేక ద్రవ్యాలు - ఫలాలు

Shivabhisheka Dravyas - Benifits
 


శివుడు అభిషేక ప్రియుడు - గంగోదకమే కాక వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకించిన విశేష ఫలితాలు లభిస్తాయి. చాలా సులభంగా లభించే ఈ ద్రవ్యాలతో మన కోరికలను బట్టి వాటిని ఎంచుకుని అభిషేకించాలి. ఇవి అన్ని వివిధ ప్రాచీన గ్రంథాల్లో తెలిపినవి. నేను పాటించినవి కూడా - పదిమందికి చెప్పగా పూర్తి ఫలితాలు లభించినవి కూడా. 

పయసా సర్వ సౌఖ్యాని దద్నారోగ్య బలం యశః !
ఆజ్యేనైశ్వర్య వ్రుద్దిశ్చ దుఃఖ నాశాశ్చ శర్కరా !!

తాత్పర్యం: పాలతో అభిషేకం చేసిన సర్వ సౌఖ్యములు లభించును. పెరుగుతో ఆరోగ్య బలము, యశస్సు లభించును. నేయితో అభిషేకించిన ఐశ్వర్యము వృద్ది నొందును. చేక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనము చేయును. 

తేజో వ్రుద్దిశ్చ మధునా ధనమిక్షు రనేనచ !
సర్వ సంపత్ సంరుద్దిశ్చ నారికేళ జలేనచ !!

తాత్పర్యం: తేనెతో అభిషేకించిన తేజో వృద్ది కల్గును. చెరుకు పాలచె అభిషేకించిన ధన వృద్ది కల్గును. కొబ్బరి నీళ్ళతో అభిషేకించిన సకల సంపదలు లభించును.  

మహాపాపాని నశ్యన్తి తక్షనాద్బస్మవారినా !
గంధతోయేన సత్పుత్ర లాభాశ్చ న సంశయః !!

తాత్పర్యం: విభూతి కలపిన నీటిచే అభిషేకించిన మహాపాపాలు అన్ని నశించగలవు. గంధము కలపిన నీటిచే అభిషేకించిన సత్పుత్ర లాభము కలుగును. 

భూ లాభః పుష్పతోయైన భాగ్యం బిల్వజలేనవై !
దూర్వ జలేన లభతే నాన్యదా నష్ట సంభవె !!

 తాత్పర్యం: పూల నీటితో అభిషేకించిన భూలాభము కలుగును. బిల్వజలముతో అభిషేకించిన భాగ్యము లభించును. గరిక నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును. 

అపమృత్యు హరంచైవ తిల తైలాభిషేకనం !
రుద్రాక్ష సరినైవ మహతీం శ్రియమాప్నుయాత్ !!

 తాత్పర్యం: నువ్వుల నూనేచే అభిషేకించిన అపమృత్యువు నశించును. రుద్రాక్ష నీటితో అభిషేకము వలన సకల ఐశ్వర్యములు లభించును. 

స్వర్నోదకాభిషేకేన ఘోర దారిద్ర నాశనం !
అన్నెన రాజ్య సంప్రాప్తిర్మోక్ష మాయుష్య జీవనం !!
 తాత్పర్యం: బంగారపు నీటితో ఘోర దారిద్రము నశించును. అన్నముచే అభిషేకించిన రాజ్య సంప్రాప్తి యు, మోక్షమును, దీర్గాయుర్దాయము లభించును. 

ద్రాక్షారసేన సర్వత్ర విజయం లభతే ధృవం !
ఖర్జూర ఫలసారేన శత్రుహానిర్భవిష్యతి !!

తాత్పర్యం:
ద్రాక్ష రసముచే అన్నింటా విజయము లభించును. ఖర్జూర ఫల రసముతో అభిషేకించిన శత్రుహాని అనేది ఉండకుండా పోతుంది. 


వైరాగ్యం లభతే జంబూ ఫల సారేనవై జగుహు !
కస్తూరీ సలిలేనైవ చక్రవర్తిత్వ మశుతే !!

తాత్పర్యం:
నేరేడు పండ్ల రసముచే అభిషేకించిన వైరాగ్య సిద్ది లభించును. కస్తూరి నీతితో అభిషేకించిన చక్రవర్తిత్వము లభించును.

నవరత్నాంబునా దాన్యగ్రుహ గోవ్రుద్ది రుచ్యుతే !
రసాల ఫల సారేన దీర్ఘ వ్యాధి వినాశనం !!

 తాత్పర్యం: నవరత్న ఉదకముచే అభిషేకించిన ధాన్యము, గృహము, గోవ్రుద్ది కలుగును. మామిడిపండ్ల రసముచే అభిషేకము చేసిన దీర్ఘ వ్యాధులు నశించును. 

హరిద్ర వారినాలింగా స్నానం వై మంగలప్రడం !
రుద్రా స్నాన ఫలన్యే తన్యుచ్యంతే మునిభిహపురా !!

 తాత్పర్యం: పసుపు నీటితో అభిషేకించిన మంగళ ప్రదము (పెళ్ళికాని వారికి పెళ్ళిళ్ళు కాగలవు) - సౌభాగ్యము సిద్దించును. రుద్రా స్నాన ఫలములు మునులచే వచియించబడినట్టివి.



No comments:

Post a Comment