Saturday, September 24, 2011

Eka Sloki

ఏక శ్లోకి 


ఆది శంకరాచార్య విరచిత 38 రచనల్లో ఒకటి "ఏక శ్లోకి", అది ఒక్క శ్లోకంతో కూడుకున్న మహా రచన. బృహదారణ్యక ఉపనిషత్ లోని నాలుగవ అధ్యాయంలో గల ఒక యజ్నవల్క్య  సంవాదం ఆధారంగా తీసుకుని శంకరాచార్యుల వారు రచించిన గ్రంథమిది. అది నాకు ఎంతో అధ్బుతంగా తోచింది, ఆ ఏక శ్లోకిని తాత్పర్యంతో ఇక్కడ పొందు పరుస్తున్నాను.  ఈ శ్లోకంలో అద్వైత సిద్దాంతాన్నంతటినీ సంగ్రహించి భోదించారు ఆది శంకరుల వారు. 


Advaitha Shankara


శ్లోకం:


కిం జ్యోతిస్తవ భానుమానహనిమేరాత్రా ప్రదీపాదికం,
స్యా దేవం రవి దీప దర్శన విధౌ కిం జ్యోతి రాఖ్యాహిమే  !
చక్షుస్తస్య నిమీలనాది సమమే కిం దీర్థియో దర్శనే,
కిం తత్రాహమతో భవన్పారమకంజ్యోతిస్తదస్మి ప్రభో !!


భావము:

1 వ ప్రశ్న: తవకిం జ్యోతి? = నీకు జ్యోతిస్సు ఏది?
సమాధానం: మే అహనిభానుమాన్, రాత్రౌ ప్రదీపాదికం = నాకు పగలు సూర్యుడు, రాత్రి దీపాదులు జ్యోతిస్సు.

2 వ ప్రశ్న: స్యా దేవం రవి దీప దర్శన విధౌ కిం జ్యోతి రాఖ్యాహిమే? = సరే కాని, సూర్య దీపాదులను గురించి తెలుసుకొనడానికి ఏది నీకు జ్యోతిస్సు?
సమాధానం: చక్షు:  =  అందుకు నా కన్నులే జ్యోతిస్సు.

3 వ ప్రశ్న: తస్య నిమీలనాది సమయే కిం? = కన్నులు మూసుకోవడం వంటి పరిస్థితుల్లో ఏది నీకు జ్యోతిస్సు?
సమాధానం: ధీ: = నా బుద్దియే తేజస్సు.

4 వ ప్రశ్న:  దీయో దర్శనే కిం? = బుద్దిని గురించి తెలుసుకొనుటకు ఏది నీకు జ్యోతిస్సు?
సమాధానం: తత్ర అహం = అందుకు నేనే జ్యోతిస్సును.

గురువు: అతో భావాన్ పరమకం జ్యోతి: = అందుచేత నీవే (ఆత్మ) పరమమైన తేజస్సు అని తెలసి కొనుము.

శిష్యుడు: ప్రభో! తత్ అస్మి = ఓ గురుదేవా! తెలిసినది, ఆ పరమ తేజస్సు నేనే.


1 comment: