Sunday, October 9, 2011

Vairaagyam


వైరాగ్యం


శ్లోకం:
న విషయభోగోభాగ్యం యోగ్యం కిల యత్ర జంతుమాత్రమపి !
బ్రహ్మేంద్ర రుద్రా మృగ్యం భాగ్యం విషయేషు వైరాగ్యం !!
                                      -ఆది శంకరాచార్య. 

తాత్పర్యం: 
విషయములను అనుభవించటం భాగ్యం అని అనుకోవద్దు! తిర్యగ్జంతువులు కూడా విషయ సుఖాన్ని అనుభవిస్తున్నాయి, దాన్నంతా మనం భాగ్యం అని అనవలేనా? మరి ఏది భాగ్యం అంటే బ్రహ్మేంద్ర రుద్రాదులకు కూడా అన్వేషించ వలసినది, వారిలో కూడా ఉన్నదా లేదా అని మనము వెతకవలసినది ఏదైతే ఉన్నదో భాగ్యం - అది ఒక్కటే అసలైన భాగ్యం - అదే విషయముల యందు వైరాగ్యం.

శోకం:
త్యక్తాని గృహే రతి మధోగతి హేతుభూతామాత్మేచ్చ యౌపనిషదర్థరసం పిబంతః !
వీత స్పృహ  విషయభోగ పదే విరక్తా ధన్యాశ్చరంతి విజయనేషు విరక్త సంఘః !!
                -(ఆది శంకరాచార్య విరచిత ధన్యాష్టకం నుండి)

వివరణ:
అధోగతికి కారణమైన గృహ నివాసాభిలాషను విడచి, ఉపనిషదర్థ రసాన్ని ఇష్టం వచ్చినంతగా త్రాగుచూ, ఎట్టి ఆశలూ లేనివాడై, విషయ భోగములందు కాని అధికారమునందు కాని ఆసక్తి లేనివారై ఉన్న ధన్యాత్ములు - సంఘ వర్జితులై విజన ప్రదేశాలలో సంచరిస్తూ ఉంటారు.

శ్లోకం:
"మోక్ష సాధన సామాగ్ర్యాం భక్తిరేవ గరీయసీ" 
                      -(ఆదిశంకరాచార్య విరచిత వివేకచూడామణి నుండి) 

వివరణ :
భక్తి ద్వారా చిత్తశుద్ధిని, జ్ఞానమును సంపాదించి మానవుడు మోక్షమును పొందవచ్చును.

శ్లోకం:
లబ్దా విద్యా రాజమాన్య, తతః కిం?
ప్రాప్తా సంపత్ ప్రాభావాద్యా, తతః కిం?
భుక్తానారీ సుందరాంగీ, తతః కిం? 
యేన స్వాత్మా నైవ సాక్షాత్క్రుతోభూత్ 
               (ఆదిశంకరాచార్య విరచిత అనాత్మ శ్రీవిగర్హణం నుండి)

వివరణ:
ఎవనిచేత తన ఆత్మ దర్శింపబడలేదో అట్టివాని చేత రాజ గౌరవము పొందగల విద్య పొందబడి నప్పటికినీ లాభమేమి? ప్రాభవము గల సంపద ఆర్జింప బడినప్పటికినీ లాభమేమి? కనుక ఆత్మా సాక్షాత్కారమును యత్నించవలెను.




Saturday, October 8, 2011

Srishaila Prastuthi


శ్రీశైలం 


 


శ్రీ శైల శృంగే వివిధ ప్రసంగే, శేషాద్రి శృంగేపి సదావసంతం !
తమార్జునం మల్లిక పూర్వమేనం, నమామి సంసార సముద్ర సేతుమ్  !!

(ఆది శంకరాచార్య విరచిత "ద్వాదశ లింగ స్తోత్రం" నుండి)


చాంచల్యారుణలోచనాంచిత కృపాం, చంద్రార్క చూడామణిం !
చారుస్మేరముఖాం చరాచర జగత్సంరక్షిణీం తత్పదాం !
చంచచ్చంపక నాసికాగ్ర విలసన్ముక్తా మణీరంజితాం !
శ్రీశైల స్థల వాసినీం భగవతీం శ్రీమాతరం భావయే !!

(ఆది శంకరాచార్య విరచిత "శ్రీ భ్రమరాంబాష్టకం" నుండి)  
     

~ : ~