Sunday, June 30, 2013

Shiva Stuthi




హస్తాభ్యాం కలశద్వయామృత రసైరాప్లావయంతం శిరో
ద్వాభ్యాం తౌ దధతం మ్రుగాక్షవలయే ద్వాభ్యాం వహన్తం పరమ్!
అంకస్యస్తకర ద్వయామృతఘటం కైలాసకాన్తమ్ శివమ్
స్వచ్చాంభోజగతం నవేందుముకుటం దేవమ్ త్రినెత్రమ్ భజే !!


తాత్పర్యం:
రెండు చేతులచే అమృత కలశాలను ఎత్తి పట్టుకొన్న వాడై,
మరో రెండు చేతులతో ఆ కలశామృతమును శిరస్సుపై పోసుకుంటున్న వాడై,
మరో  రెండు చేతులలో అక్షమాలను, మృగ ముద్రనూ కలిగిఉన్న వాడై,
మరో రెండు చేతులతో రెండు అమృత కలశాలను ఒడిలో పెట్టుకున్న వాడై,
కైలాస ప్రభువై స్వచ్చమైన కమలములపైన కూర్చొని ఉండి, 
బాలచంద్రుని శిరస్సున భూషణముగా కలిగి ఉన్నవాడైన త్రినేత్రునికి నమస్కరిస్తున్నాను.




Saturday, June 29, 2013

Kedarnath - Mahatmyam

Kedarnath Jyotirling Mahatmyam - Recent Floods

 (स्कंद्पुरण के अनुसार - केदारनाथ यात्रा के समय कोई मानव दर्शन करने से पहलेही रास्ते में मृत्यु हो गए थो वो पुण्यलोक प्राप्त करेग) 

Kedarnath Temple old Photo (Near 1900 )



Kedarnath Lingam


Mahaadri parshvecha thate ramantham, Sampoojyamaanam sathatham muneedraih !
Suraasurai yaksha mahora gaadhyai, Kedaara meesham shiva meesha meede !!


महाद्रि पार्शवेच थटे रमन्थम, सम्पूज्यमानाम सथथम मुनीन्द्रैः !
सुरासुरैयक्ष महोरगाध्यै, केदारमीषम शिवमीषा मीडे!!

శ్రీ కేదారనాథ్ లింగము జ్యోతిర్లింగాలలో అయిదవది. ఈ జ్యోతిర్లింగం స్వయంభువు - ప్రకృతి సిద్దంగా ఏర్పడినట్టిది. కేదారనాథ్ యొక్క సవిస్తార ప్రశస్తి స్కంద పురాణంలోని కేదారఖండంలో విస్తృతంగా వివరించబడింది. ఈ క్షేత్ర మహిమ వర్ణనాతీతం. కేదార శిఖరమున ఉండే ఈ దేవాలయమునకు పశ్చిమమున మందాకినీ నది, తూర్పున అలకనందా నదీ ప్రవహిస్తూ ఉంటుంది. మందాకినీ నది తీరంలో కేదారనాథ్ ఉండగా అలకనందా నదీ తీరాన బదరీనాథ మందిరం ఉంటుంది. రుద్రప్రయాగలో మందాకినీ మరియు అలకనందా  నదులు కలియును. ఇవి రెండు నదులూ కలిసి కొంత దూరం ప్రయాణించి దేవప్రయాగ దగ్గర భాగీరథి నదిలో (గంగా నది) కలిసిపోతాయి. గంగా నదిలో మునగటం వల్ల కేదారనాథ్, బద్రీనాథ్ ల చరణ కమలోదకంలో మునిగినట్లై పవిత్రులగు చున్నారు. 

హిమాలయాల్లో కొలువుండే ఈ జ్యోతిర్లింగాన్ని దర్శించిన మానవుడు తన జీవితాన్ని ధన్యం చేసుకున్న వాడవుతున్నాడు. ఈ లింగాన్ని దర్శించుకోవటం సంవత్సరంలో కేవలం కొన్ని నెలలు మాత్రమె (June-Sept/Oct) వీలవుతుంది. ఆపైన అక్కడ మంచు పెరుకుపోవటం వాళ్ళ వీలు పడదు. ఆ ప్రాంతమము అతి పవిత్రము - అక్కడ దేవతలు సంచరిస్తుంటారు అని ప్రతీతి - అందుకే పూర్వ కాలంలో అక్కడ నివాసాలు ఉండేవి కావు.


కాని ప్రస్తుత పరిస్థితి వేరు - అక్కడ నియమ నిబంధనలకు విరుద్దంగా జనావాసాలు వెలిసాయి - ప్రకృతినీ, పవిత్రతను పాడు చేసి వెక్కిరించాయి. ఫలితం 14 June 2013 న కట్టలు తెంచుకు ప్రవహించి ఉప్పొంగి ముంచెత్తి ఒక్క కేదారనాథ్ ఆలయం తప్ప అన్నింటినీ తుడిచి పెట్టిన మందాకినీ-అలకనందా నదీమ తల్లులు. ఎవరి స్వార్థానికి ఎవరు బలయ్యారో చెప్పలేం కాని కేదారనాథ్ దర్శనానికి వెళ్లి మరణించిన వారంతా పురాణవచనం ప్రకారం శివసాయుజ్యం చేరుకున్న పుణ్యాత్ములే. 

ఇక్కడ మరో చిత్రమేమంటే  సర్వం కొట్టుకుపోయినా కేదారేశ్వరుడు నందీశ్వర సమేతంగా నిలిచి ఉండటం ప్రళయ కాలంలోనూ మిగిలి ఉండేది పుట్టుక-చావుటలు లేని తను ఒక్కడే నని చెప్పటం కొరకేమో అని సామాన్య పామరులం గ్రహించుట కొరకేమో అనుకోవాలి.

दृष्ट्वा रूपम् नरस्यैच तथा नारयनस्यच !
केदारेश्वर साम्बश्च मुक्थिभागी न संशयः  !!     

अकृत्या दर्शनम् वैश्य केदारस्याघि नषिणः
यो गच्छेद् बदरीम तस्य यात्रा निष्पलतां भवेतः

केदरेशस्या भक्थाये मार्गस्था स्तस्यवै मृतः !
तेरी मुक्था भवन्त्येव दात्रा कार्य विचारणा !!      - Skandapuran


పై శ్లోకాల బట్టి తెలిసేదేమంటే కేదారనాథ్, బద్రినాథ్ లను దర్శించిన వారికి సమస్త పాపుములు నశించి జీవన్ముక్తి లభించును. ఎవరైనా కేవలం బద్రీనాథుని దర్శించి కేదారనాథుని దర్శించనిచో ఆ యాత్ర నిష్ఫలమగును. కేదార యాత్రకు బయలు దేరిన వారు మద్యలో మరనించినను (కేదారనాథుని దర్శనం కాకున్ననూ) పున్యలోకములను పొందును. 












Friday, June 28, 2013

Bhramrambaashtakam

శ్రీశైల భ్రమరాంబాష్టకం - తెలుగు
 Srishaila Bhramarambha Ashtakam Lyrics - Telugu



రవిసుదాకర వహ్నిలోచన రత్నకుండల భూషిణీ
ప్రవిమలంభుగ మమ్మునేలిన భక్తజన చింతామణి
అవని జనులకు కొంగు బంగారైన దైవ శిఖామణీ 
శివుని పట్టపురాణి గుణమని శ్రీగిరీ భ్రమరాంబికా

సోమశేఖర పల్లవాదరి సుందరీమణి ధీమణి
కోమలాంగి కృపాపయోనిధి కుటిల కుంతల ధీమణి
నామనంబున బాయకుండెటి నగకులేశ్వర నందనీ
సీమ లోపల వినుతి కెక్కిన శ్రీగిరీ భ్రమరాంభికా  

అక్షయంబుగ కాశిలోపల అన్నపూర్ణ భవానివై
సాక్షిగణపతి గన్నతల్లివి సద్గుణావతి శాంబవీ
మోక్షమోసగెటి కనక దుర్గవు మూలకారణ శక్తివై
శిక్షజేతువు క్రూరజనులను శ్రీగిరీ భ్రమరాంభికా

కలియుగంబున మానవులకూ కల్పతరువై యుండవా
వెలయు శ్రీగిరి శిఖరమందున వైభవముగా నుండియూ
అవనిలోపల భక్తజనులకు నవని దానంబివ్వవా
జిల్కు కుంకుమ కాంతి రీతులు శ్రీగిరీ భ్రమరాంభికా

భూతనాథుని వామభాగము పొందుగా చేకొంటివే
భ్రాంతిగా శ్రీశైలమందున ప్రకాశమై నివసించియూ
పాతకంబులు బారదోలుచు భక్తులను చేకొంటివే
రజితగిరిపై నుండి వెలసిన శ్రీగిరీ భ్రమరాంభికా

మీరు వెలసిన మీ ప్రభావము విష్ణులోకమునందునా  
మొల్లవించిన యింద్రలోకము బ్రహ్మలోకము నందునా
వెలమితో కైలాసమందున మూడు లోకములందునా  
చెల్లునమ్మా లోక పావన శ్రీగిరీ భ్రమరాంభికా

అంగ వంగ కళింగ కాశ్మీరాంధ్రదేశము నందునా
పొందుగా కర్ణాట కొంకణ పుణ్యభూముల యందునా
రంగుగా కర్నాట లాట మారాట దేశము నందునా
శృంగళా రాజ్యమున వెలసిన శ్రీగిరీ భ్రమరాంభికా


తరుణి శ్రీగిరి మల్లిఖార్జున దైవరాయుని బాలినీ
కరుణతో మమ్మేలు కొన్మిక కల్పవృక్షము భంగినీ
నిత్య మెప్పుడు అష్టకంబును వ్రాసి చదివిన వారికీ 
సిరుల నిచ్చుచు నుండ గోరెద శ్రీగిరీ భ్రమరాంభికా

ధరణిలోపల అష్టకంబును విన్నవారికి ఎప్పుడూ 
ఘాలి భూత పిశాచ బాధలు చేరకుండగ జూడుమీ 
ఇందునున్నా తప్పులెల్లను ఒప్పుగా భావించుమీ
నాదు  రక్షింప గోరెద శ్రీగిరీ భ్రమరాంభికా









Thursday, June 27, 2013

Srishaila Varnana

శ్రీశైల వర్ణనము 

Every Stone is Shivaling (a Shivaling Aakaar Nature Stones at Paladhara-Srishailam)


పాల్కురికి సోమనాథుని పండితారాధ్య చరిత్ర నుండి కొన్ని పంక్తులు 
Srishaila Varnana - Few Lines from "Panditaaradhya Charitra"







Thursday, June 13, 2013

Old Shiv Temple in Iran

I collected below matter from Vibhuthi 1940

(ప్రఖ్యాత విభూతి మాస పత్రిక పండిత చిదిరేమఠం వీరభద్ర శర్మ గారి సంపాదకత్వాన పలు సమత్సరాలు వెలువడినది. శ్రీవారు కాశీ జగద్గురు పీఠం అధిష్టించేవరకు వెలువడి అమోఘ వేద వేదాంగ సంబంధ శివతత్వ వెలుగుల ప్రసరింప జేసింది. ఆ పత్రిక వెలుగులు నేటికినీ అమూల్య జ్ఞాన కిరణాలే. )

This Ancient Temple was built in 1892 AD (hijri 1310)  (as per the Iran Tourism site.)

As per said by visited Article writers Mahesh Prasad, Moulani, Alim Fazil Temple Status in 1929:

This temple built by some of the Hindu Soldiers. Shivling Brought from India.
Puja done by Local Hindus. There is only 60-70 Hindu people. Nearly 8,000 Muslim Population is there.
Many Devotees visits Temple Daily.
In Puja time they play Bell, Taal, Mrudang, Shankh, Dhol - no one object about the voice.
The Temple area 18 acres and situated in middle of the Bandar Abbas Ancient City.
Sri Krishna, Anjaneya, Yogamaya idols also there.
There is a Sikh Gurudwara beside Shiv Temple.


To see information about Shiv Temple Go this Link:

http://www.itto.org/tourismattractions/?sight=429&name=Hindus+Temple#top


To know more about present Temple Status Go this Link:
http://historicaliran.blogspot.in/2010/09/hindu-temple.html

Iran Shiv Temple Photo Taken on  17-May-1929

About Iran Hindu Temple Shialay 



About Iran Hindu Temple Shivalay