Monday, September 26, 2011

Padya Ratnaalu


పద్య రత్నాలు  


నా కిష్టమైన కొన్ని పద్యాలు...........


శివకవులకు నవ కవులకు
శివ భక్తికి, తత్వమునకు, చింతామణికిన్ 
శివలోక ప్రమథులకును 
శివనకు, గురునకు శరణు సేయర వేమా.
                                  (వేమన గారు రచించిన పద్యాల్లో తొలి ప్రార్థనా పద్యం ఇది)

నీరున బుట్టిన యుప్పే
క్షారము నీరాయే, నీరు-క్షారము నొకటే
యీ రీతి శివుని-జీవుని
వారక మది నేరుంగనౌను వసుధను వేమా. 

కట్టెయందు నిప్పు గానని చందమీ
తనువునందు నాత్మ తగిలి యుండు
మఱుగు దెలిసి శివుని మార్కొని చూడరా
విశ్వదాభిరామ వినుర వేమా.

ఆరుగురిని జంపి హరుమీద ధ్యానంబు
నిలిపి నిశ్చయముగ నెగడి యాత్ర 
గతి నేరుంగుచుండు ఘనుడగు యోగిరా 
విశ్వదాభిరామ వినుర వేమా.

మురికి కొంపలోన నిరికించి జీవుని 
గర్మ పాశములను గట్టి వేసె 
నిట్టి కర్మజీవి కెట్లగో మోక్షంబు 
విశ్వదాభిరామ వినుర వేమా.

నీళ్ళు బోసి కడిగి నిత్యంబు శోధించి 
కూడా బెట్టి పైన కోకగట్టి 
యేమి పాటు పడుదురీ దేహ గ్రంధికి 
విశ్వదాభిరామ వినుర వేమా.

ఈకేలనుచు కొన్ని తోకలనుచు కొన్ని
కొకలనుచు కొన్ని గోచులనుచు
కచ్చ మూసివేసి కట్టడి చేసేరా
విశ్వదాభిరామ వినుర వేమా.

భక్తియున్న చోట బరమేశ్వరుడుండు
భక్తిలేని చోట బాపముండు
భక్తి గలుగువాడు పరమాత్మ తానయా
విశ్వదాభిరామ వినుర వేమా.

వేద విద్య గాడు వీర విద్య గాదు
పరమ విద్య గాడు పరువు గాదు
మధురమైనయట్టి మనసు నిల్పెడు విద్య
సాధు విద్య యగును సరగ వేమా. 

భావాభావములంటక
సేవించెడు బట్ట బయలు స్థిరమతి లోనన్
కేవల శివ పరధ్యానము 
తావరమున గన్నవాడే ధన్యుడు వేమా.

ఆది దేవుడగు మహాదేవుమీద నె 
వ్వాని మనసు భక్తి వైభవమున
నుల్లసిల్లు నతని నెల్లకాలముల డ
గ్గరదు సూవే గ్రహ వికార వితతి.
                                 (ఎఱ్ఱన, ఆంధ్ర మహా భారతం)

శివయోగి నొక మాటు చింతింప తడవ
శివభక్తి బొందిన శివయోగి వరుల
నేయే కులమని యెరుక గైకొనకు 
పరుసమోంది యిన్ము పసిడిమైయుండు.
                                ("మనో భోధ" నుండి)

నయమొప్ప సిద్దసనంబున నునిచి
లాలిత హస్త పల్లవమున ముట్టి
ఫాల భాగంబున భసితంబు బెట్టి
హస్త మస్తక యోగ మాచారింపుచును
పరమోపదేశ మీ పట్టున జీవ
                                 (పరమానంద యతి విరచిత (1600 AD) -  "శివజ్ఞాన మంజరి"  నుండి)




No comments:

Post a Comment