Tuesday, January 27, 2015

Karpura Neerajanam

కర్పూర నీరాజనం

Karpura Neerajanam (Photo by Me)

కర్పురామళ జ్యోతిప్రభామయ 
సుప్రమథ గణార్యా శౌర్యా కర్పురామళ
గిరిజావరసుర గిరికార్ముఖవర
గిరిజావరసుర గిరికార్ముఖవర
గిరిధరసుతనాశా....  మహేశా
కర్పురామళ జ్యోతిప్రభామయ 
సుప్రమథ గణార్యా శౌర్యా కర్పురామళ
ఫనిభూషణ వారణచర్మాంబర
ఫనిభూషణ వారణచర్మాంబర
ప్రణవసదాకారా...  వీరా 
కర్పురామళ జ్యోతిప్రభామయ 
సుప్రమథ గణార్యా శౌర్యా కర్పురామళ
వరదాద్వయదిన కరజాహితపుర
వరదాద్వయదిన కరజాహితపుర
హరఘనమఠవాస.... మహేశ
కర్పురామళ జ్యోతిప్రభామయ 
సుప్రమథ గణార్యా శౌర్యా కర్పురామళ

(కర్పూర హారతి తరువాత కర్పూరం బెళగుకునేటప్పుడు చెప్పే శ్లోకం)

కర్పూరగౌరం కరుణావతారం
సంసారసారం భుజగేంద్రహారం
సదావసంతం హృదయారవిందే
భవమ్ భవానీసహితం నమామి

 ~ : ~ 

Monday, January 26, 2015

Dhoopa Harathi

DhoopAarti
ధూప హారతి 

Drawing by me

ధూపాము శివలింగా దుర్జాన భంగ... శివ దుర్జాన భంగ 
ధూపామిష్టాలింగా నీకు దూపాము
బహుజన్మ కృపదోష పరిహారమైన... శివ పరిహారమైన
గుగ్గుళ్ళ ధూపాము గురురాయ నీకు
ధూపాము శివలింగా దుర్జాన భంగ... శివ దుర్జాన భంగ 
ధూపామిష్టాలింగా నీకు దూపాము
ముగ్గూరయ్యలకెంతో మొదామైనట్టి... శివ మొదామైనట్టి
మైసాక్షి ధూపాము మహాదేవ నీకు
ధూపాము శివలింగా దుర్జాన భంగ... శివ దుర్జాన భంగ 
ధూపామిష్టాలింగా నీకు దూపాము
వాసాన సూగంధ వాసానలిచ్చు... శివ వాసానలిచ్చు 
దాశాంగు ధూపాము దవళాంగ నీకు
ఇరవైన సంచార వీరా మహేశా... శివ వీరామహేశ 
వరభక్త వరులకు చాలా దూపాము
ధూపాము శివలింగా దుర్జాన భంగ... శివ దుర్జాన భంగ 
ధూపామిష్టాలింగా నీకు దూపాము
పాలించి మమ్మేలు పంచాకంఠేశా.... శివ పంచాకంఠేశ
లీలా సద్గుణరాయ నీకు దూపాము
ధూపాము శివలింగా దుర్జాన భంగ... శివ దుర్జాన భంగ 
ధూపామిష్టాలింగా నీకు దూపాము
శివసాంబ శివమూర్తి శృంగారవర్తి... శివ శృంగారవర్తి
శివభక్త వరులకు చాలా ధూపాము
ధూపాము శివలింగా దుర్జాన భంగ... శివ దుర్జాన భంగ 
ధూపామిష్టాలింగా నీకు దూపాము

~:~ 

Wednesday, January 14, 2015

Veerabhadra Mangala Harathi

శ్రీ వీరభద్ర స్వామి మంగళ హారతి
Shri Veerabhadra Swamy Mangala Harathi

Shri Veerabhadra Swamy, Patalaganga-Srishailam (Photo by Me)

భద్రమంగళం వీరభద్రమంగళం - భద్రకాళి మనోహరా భవ్యమంగళం 
అలదక్షుడు యాగంబును అహంకార పూరితుడై 
శూలిననాదరము సేయ శోషణ పాల్జేసినట్టి 
భద్రమంగళం వీరభద్రమంగళం - భద్రకాళి మనోహరా భవ్యమంగళం 
దాక్షాయణి అనుమానపు తాపగ్నిని కుమిలి కుమిలి
దక్షయజ్ఞ కుండికబడ దక్షుని శిక్షించినట్టి
భద్రమంగళం వీరభద్రమంగళం - భద్రకాళి మనోహరా భవ్యమంగళం 
హరుడు జటాజూటమ్మును ఆర్చి శిలను తాడించగ
పరమేశ్వరుకోపాగ్నిని ప్రభవించిన ప్రళయరుద్ర
భద్రమంగళం వీరభద్రమంగళం - భద్రకాళి మనోహరా భవ్యమంగళం 
దక్షుని ఆహ్వానంబున తగుదుమంచు నరుదెంచిన
దక్షురుక్ష సురవీరుల శిక్షించిన రుక్షాక్షా 
భద్రమంగళం వీరభద్రమంగళం - భద్రకాళి మనోహరా భవ్యమంగళం 
దక్షయజ్ఞ ధ్వంసంబును దక్షతతో గావించియు 
దక్షుని శిరమును ద్రుంచి విచక్షణతొ విహరించిన
భద్రమంగళం వీరభద్రమంగళం - భద్రకాళి మనోహరా భవ్యమంగళం
హరి నృసింహునవతారము అంతము వికృతంబు కాగ
నరసింహుని నిర్జించిన శరభమూర్తి వీరభద్ర
భద్రమంగళం వీరభద్రమంగళం - భద్రకాళి మనోహరా భవ్యమంగళం 
హరవరసుత వీరభద్ర ఆర్తిజన దయాసముద్ర
శరణగణ సమూహ సహిత శంకరాఖ్య కవి వినుతా
భద్రమంగళం వీరభద్రమంగళం - భద్రకాళి మనోహరా భవ్యమంగళం 

~ : ~