Monday, September 24, 2012

Mallikarjuna Linga

మల్లిఖార్జున లింగా ! ..........
(కంద పంద్యాలు)




కనుమూసి నిన్ను జూచితి
కనుదెరచియు నీదు రూపు గంటిని గానన్
కనుమూసిన కనుదెరచిన
ననుసరణము నీదె  మల్లిఖార్జున లింగా  !

నీ చింతను జేసెడి మతి
నీ చరణమునందె గలయు, నిఖిల విషయవాం
ఛా చింతను జేసేడి  మతి
యా చింతనె  గలయు మల్లిఖార్జున లింగా !

మౌనము  వాగ్దండమగున్,
 ధ్యానము మానసిక దండమౌ, ప్రాణాయా
మానుకృతి దేహదండం
బౌ ననిరిటు బుద్ధులు మల్లిఖార్జున లింగా !

ఎక్కడ నుండునొ  నామన
మక్కడ నీ రూపముండు నా తీరుననే
యెక్కడ నా శిరముండునొ 
యక్కడ నీ యడుగు మల్లిఖార్జున లింగా !

మంగళగుణ,  మంగళకర,
మంగళ పరిపూర్ణ, సర్వ మంగళ నామా
మంగళమగు  నిను దలచగ
నంగజ భసితాంగ  మల్లిఖార్జున లింగా !

శంభో శివ, శంభో హర,
శంభో యని భజన సేయు సద్భక్తతతిన్
రంభాదులు  గోరుదురట
యంభో భ్రుత్కేశ మల్లిఖార్జున లింగా !

శుభమగు నీ నామముచే
శుభములు చేకూరు చిత్తశుద్దియు గలుగున్ 
సభలోన జయము నంతట
నభయంబును గలుగు మల్లిఖార్జున లింగా !

శివమగు లింగార్చనచే
శివజీవైక్యంబు నిష్ఠసిద్ధులు  గలుగున్
సువివేకబుద్ధి   యొదవును
నవిహత సుఖమబ్బు మల్లిఖార్జున లింగా !

దండము శివలింగమునకు 
దండము రుద్రాక్ష బిల్వతరు భస్మలకున్ 
దండము పంచాక్షరి కఖి
లాండేశ్వర నామ  మల్లిఖార్జున లింగా !


Sunday, September 23, 2012

Nandeeshwara Darshanam

 Nandeeshwara Praarthana

Nandeeshwara namastubhyam saambaananda pradaayaka
mahaadevasya sevaartham anujnaam dehime prabho |
vedapaadam vishaalaaksham teekshna shrungam mahonnatham
ghantaangale dhaarayantam svarna ratna vibhooshitham
saakshaaddarma tanum devam shivaroopam vrushambhaje ||

Uksham Vishnumayam vishaanakulisham rudra svaroopam mukham
rugvedaadi chatushtayam padayutham, suryendu netra dvayam !
naanaa bhooshana bhooshitam suranutam, vedaantha vedyam varam
andam teerthamayam, sudharma hrudayam sree nandikesham bhaje !!

Photo from my father's Rudradhyaya notes


NANDEESHWARA NAMASKARA VIDHAANAM - PRAMUKHYATA

Vrushasya vrushanam sprushtvaa eeshwarasyaavalokanam !
shrungamadhye shivam drushtvaa punarjnma na vidyate !!
shrungayor vaamahastasya tarjanyangushtakenyaseth !
andam savye sprushtvaa shrungamadhye shivam yajeth !!

 శివ  దర్శనంలో శివునికంటే అధిక ప్రాధాన్యత-ప్రథమ దర్శనం నందికి ఉంటుంది. ముందుగా ఆయన్ని  స్మరించుకుని, దర్శించుకుని కాని శివ దర్శనం చేయరాదు - చేసిన చేసిన అది నిష్ఫలమే అవుతుంది అని శాస్త్రాలు చెపుతున్నాయి. నందీశ్వరుని అనుమతి తీసుకున్న తరువాతనే శివుని దర్శించుకోవాలి. నందీశ్వరుని రెండు కొమ్ముల యందున ఎడమ చేతి బొటనవ్రేలు, చూపుడు వ్రేలు ఉంచి కుడి చేతితో నంది అండములను స్ప్రుశించుచూ (శ్రీశైలము, వేములవాడ, కాళహస్తి ఆదిగా గల ప్రధాన శివ క్షేత్రాల్లో సుప్రభాత వేళ ముందుగా వ్రుశాభానికి పూజ చేశాకే స్వామి వారికి పూజ చేస్తారు - ఆ సుప్రభాత వేళలో వెళితే మనకు కూడా వృషభ పూజ చేసే భాగ్యం కలుగుతుంది. వృషభము ధర్మ స్వరూపముగా చెప్పబడుతుంది, దాని నాలుగు పాదములు పురుషార్థములు. శివ దర్శన వేల వృషభ అండ స్పర్శ  అనునది - చెడు కోరికల నిగ్రహమును, మంచి కోరికల సిద్దిని కలుగజేస్తుంది.)