- "నా రుద్రో రుద్ర మర్చయేత్" - రుద్రాంశను తనయందు నింపుకుని (లఘున్యాసము లేదా మహాన్యాసము ద్వారా చేయగలము) మాత్రమే రుద్రుని అర్చించవలెను.
- శివపూజ చేయు సమయమున తప్పక నొసట విభూతి, మేడలో రుద్రాక్షమాల ధరించవలెను.
- శివాభిషేకము / శివపూజ చేసిన పిదప స్నానము చేయ కూడదు - చేసిన మహా పాతకము.
- వేదములలో శతరుద్రీయము గొప్పది. యజుర్వేదాంతర్గతమైన ఈ రుద్రము మహా మహిమాన్వితము. దానిని పటించుచూ లింగాభిషేకము చేసిన అనంత ఫలము లభించును.
- తడి బట్టలచే పూజ చేయరాదు. తడి బట్టలు దిగంబరముతో సమానము. తడి బట్టలను అమంగళములు ఆశ్రయించుకొని ఉండును.
- ప్రదక్షిణ చేయునపుడు నెలలు నిండిన గర్భిణి నీటి బిందెను తీసుకుని నడచినంత నెమ్మదిగా అడుగులు వేస్తూ శివుని మనసున ధ్యానిస్తూ ప్రదక్షిణ చేయాలి. పరుగెత్తుట, త్వరత్వరగా నడచుట కూడదు.
- శివపూజ యందు దవలాక్షతలను వాడవలెను. దవలాక్షతలు ముక్తి దాయకములు.
- శివపూజ యందు శివునికి ప్రీతికరమైన ఎర్ర గన్నేరు, నందివర్ధనం, జిల్లేడు, సంపెంగ, వాకుడు, సురపొన్న అను ఎనిమిది పుష్పములను వాడవలెను, అన్నీ లభ్యము కాకున్న, కనీసము ఏదేని ఒకటి తప్పక ఉపయోగించుట ఫలప్రదము. అష్టపుష్పముల పూజ అష్టైశ్వర్య దాయకము.
- మారేడు దళములతో శివుని పూజించిన ఇహమున సుఖమును - పరమున కైలాస ప్రాప్తిని పొందగలరు.
- రుద్రాద్యాయము నిత్యమూ పటించిన సర్వమూ వశమగును.
- శివాభిశేక సమయమున కొబ్బరికాయ కొట్టి ఆ నీటితో అభిషేకించి, ఆ కొబ్బరి చిప్పలను పక్కన పెట్టాలి, శివుని దెగ్గర పెట్టి నివేదించుటకు పనికిరావు.
................................................................................Sarvam Shivamayam Jagath.......................................................................
Wednesday, October 3, 2012
Shiva Pooja Niyam & Abhisheka Phalam
Labels:
Shivapuja - Niyamas
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment