Wednesday, October 3, 2012

Shiva Pooja Niyam & Abhisheka Phalam







శివపూజ చేసేటపుడు మనము గుర్తుంచుకోదగినవి
 చేయవలసినవి - చేయకూడనివి 

  1. "నా రుద్రో రుద్ర మర్చయేత్" - రుద్రాంశను తనయందు నింపుకుని (లఘున్యాసము లేదా మహాన్యాసము ద్వారా చేయగలము) మాత్రమే రుద్రుని అర్చించవలెను.
  2. శివపూజ చేయు సమయమున తప్పక నొసట విభూతి, మేడలో రుద్రాక్షమాల ధరించవలెను.
  3.  శివాభిషేకము / శివపూజ చేసిన పిదప స్నానము చేయ కూడదు - చేసిన మహా పాతకము.
  4.  వేదములలో శతరుద్రీయము గొప్పది. యజుర్వేదాంతర్గతమైన ఈ రుద్రము మహా మహిమాన్వితము. దానిని పటించుచూ లింగాభిషేకము చేసిన అనంత ఫలము లభించును.
  5.  తడి బట్టలచే పూజ చేయరాదు. తడి బట్టలు దిగంబరముతో సమానము. తడి బట్టలను అమంగళములు ఆశ్రయించుకొని ఉండును.
  6. ప్రదక్షిణ చేయునపుడు నెలలు నిండిన గర్భిణి నీటి బిందెను తీసుకుని నడచినంత నెమ్మదిగా అడుగులు వేస్తూ శివుని మనసున ధ్యానిస్తూ ప్రదక్షిణ చేయాలి. పరుగెత్తుట, త్వరత్వరగా  నడచుట కూడదు.
  7.  శివపూజ యందు దవలాక్షతలను వాడవలెను. దవలాక్షతలు ముక్తి దాయకములు.
  8. శివపూజ యందు శివునికి ప్రీతికరమైన ఎర్ర గన్నేరు, నందివర్ధనం, జిల్లేడు, సంపెంగ, వాకుడు, సురపొన్న అను ఎనిమిది పుష్పములను వాడవలెను, అన్నీ లభ్యము కాకున్న, కనీసము  ఏదేని ఒకటి తప్పక ఉపయోగించుట ఫలప్రదము. అష్టపుష్పముల పూజ అష్టైశ్వర్య దాయకము.
  9. మారేడు దళములతో శివుని పూజించిన ఇహమున సుఖమును - పరమున కైలాస ప్రాప్తిని పొందగలరు.
  10. రుద్రాద్యాయము నిత్యమూ పటించిన సర్వమూ వశమగును. 
  11. శివాభిశేక సమయమున కొబ్బరికాయ కొట్టి ఆ నీటితో అభిషేకించి, ఆ కొబ్బరి చిప్పలను పక్కన పెట్టాలి, శివుని దెగ్గర పెట్టి నివేదించుటకు పనికిరావు.



No comments:

Post a Comment