బిల్హణస్తవము
అత్యంత శివప్రీతికరమైన, మృదుమధురమైన ప్రసిద్దమైన మహిమ్న, మల్హణ, మలయరాజ, అనామయ, హలాయుధ మనెడు శివపంచస్తవములతో బాటు 11వ శతాబ్దములో బిల్హణకవిచే రచించబడిన బిల్హణస్తవము కూడా ఎంతో ప్రసిద్ది నొందినది. ఈ బిల్హణస్తవముకై నెట్ లో వెతికితే నాకు ఎక్కడా ఏ భాషలోనూ కనిపించలేదు. ఎంతో శ్రవణానందమయమైన ఈ స్తవమును బిల్హనుడు బహు చమత్కారంగా శివుని స్తుతిస్తూ రచించాడు. అందులో కొన్నిటిని ఇక్కడ పొందుపరుస్తున్నాను.
(1)
సంతు సహస్రం దేవాస్తద్గుణ దోశోక్తిభిః కి మస్మాకం
శివమేవ వర్ణయామ: పునరపి శివమేవ శివమేవ.
తాత్పర్యము
వేలకొలది దేవతలుందురు గాక !
వారి గుణదోషములతో మాకేమి పని ?
మేము శివునే వర్ణింతుము.
మరల.... మరల.... శివునే స్మరింతుము.
~ : ~
(2)
ధత్సే మూర్థ్ని సుధామయూఖశకల శ్లాఘ్యే కపాలస్రజం
వక్షస్యద్రిసుతాకుచాగురురజస్సాంద్రే చితాభస్మాచ
తద్భాణాది కవి ప్రణీత లలిత స్తోత్ర ప్రబంధప్రియే
త్వత్కర్ణే లభతామయం మమ గిరాం గుంభోపి సంభావనాం.
తాత్పర్యము
అమృతకిరణములుగల చంద్రరేఖను ధరించిన తలకు - పుర్రెలదండను దాల్చినావు.
పార్వతీదేవి స్తనముల అగరు పూతలు దట్టముగా అంటియున్న వక్షస్థలముననే - కాటిబూడిద అలదినావు.
అలాగే బాణాది కవీశ్వరులచే రచించబడిన సుందరమైన కావ్యముల విని ఆనందించిన నీ కర్ణముననే - నా ఈ మాటల వరుసయూ మన్నన పొందునుగాక.
~ : ~
(3)
పంచబ్రహ్మషడంగబీజ ముఖర ప్రాసాద పంచాక్షర
వ్యోమవ్యాపి పురస్సరేషు మనుషు ప్రౌఢి: కుతో మదృశాం
ఒంకారాదినమోంత ముద్రిత భవన్నామావళీకల్పితం
సర్వం మంత్రతయా ప్రభో పరిణమత్యంతర్భహిర్యోగత:
తాత్పర్యము
ప్రభో ! సద్యోజాతాది పంచబ్రహ్మముల యొక్క వశ్యాకర్షనాది
షడంగ బీజాక్షరముల చేత మిక్కిలి గొప్పదగు ప్రసాద పంచాక్షరి యొక్క
అక్షరములతో భూనభోంతరాళములు నిండుకొను మహామంత్రములలో
మాబోంట్లకు పాండిత్య మెక్కడిది?
"ఓం"కారమును ఆదియందును "నమః" శబ్దమును అంత్యమందునూ
నీ నామదేయములకు ముందువెనకాల చేర్చినచో అన్నీ కూడా మంత్రస్వరూపము అయిపోవు చున్నది.
~ : ~
(4)
ప్రాసాదైస్తవ కిం శ్మశానవసతే: స్నానై: కి మస్థి స్పృశ:
కిం వస్త్రైశ్చ దిగంబరస్య భాసితాలేపస్య గంధైశ్చ కిం
కిం ధూపై: శవధూమధూమ్రపపుష: కిం కాలకూటాశినో
నైవేద్యైరితి భక్తిమాత్రసులభం త్వాం దేవా సేవామహే.
తాత్పర్యము
ఈశ్వరా! శ్మశానములో ఉండేవానికి ఆలయముతో నేమి?
ఎముకలు దాల్చువానికి అభిషేకమేల?
దిగంబరునికి పట్టువస్త్రాలతో పనేమీ?
బూడిద రాసుకొనే వానికి గంధముతో అవసరమేమి?
శవాల పొగచే నల్లనైన వానికి ధూపంతో ఇంకేమి పని?
ఈ విధంగా భావించి ఓ పరమేశ్వరా!
నిను భక్తిమాత్రముననే సులభునిగా తలచి సేవించుచున్నాను.
~ : ~
(5)
ఉత్తరంగ మధిమస్తకగంగావారి ధారయాసి వారిజగంధి
కిం పయై శ్చుళుక బిల్వదళైస్తే భిక్షురుజ్జతి కదాచన లాభం.
తాత్పర్యము
ఉన్నత తరంగాలు కలిగిన, కమలముల సుగంధములు కలిగిన గంగాజలన్నే తలలో దాల్చినావు గదా!
అయినా దోసెడు నీటి అభిషేకం, గుప్పెడు మారేడుపత్రితో నీకవసరమేమీ?
అంతేలే! భిక్షమడుక్కునేవాడు ఏ చిన్నదాన్నైనా వదులుకుంటాడా?
~ : ~
(6)
సస్యారోపణరక్షణా క్షమతయా భిక్షాటనం నిర్మితం
కచ్చ గ్రంధనమోచనాలసతాయ వసో దిశః కల్పితాః
శాణాన్వేషణ ఘర్షణా సహతాయ భస్మాంగరాగః కృతః
విశ్వోత్పాదనరక్షణాప హరణాయా సస్త్వాయ నేక్షిత:
తాత్పర్యము
విత్తనాలు నాటుకొనలేక బిచ్చమెత్తుకొనుచుంటివి !
చెంగులు దీసి కట్టుకొని విప్పుటకు ఓపిక లేక దిగంబరునిగా తిరిగుచుంటివి !
సానెదెచ్చి గంధము తీయలేక బూడిద పూసుకోను చున్నావు !
అయితే శంభో ఈ ప్రపంచాన్ని పుట్టించుట, పోషించుట, గిట్టించుటల యొక్క ఆయాసాన్ని మాత్రం ఎందుకు నీవు లెక్కించుట లేదు?

(7)
వాణీ పంకరుహాసనస్య గృహిణీత్యాస్థాయి మౌనవ్రతం
లక్ష్మీ: సాగారశాయిన: ప్రియతమే త్యగ్రాహి భిక్షాటనం
ఇత్థం స్వామినిషిద్ద సేవక వధూ సంభోగబీభత్సయా
పంచాసేవిషత త్వయా దృతిదయదాంతి క్షమా ముక్తయ:
తాత్పర్యము
వాణి (మాట) బ్రహ్మకు భార్య కావున దానినంటక మౌనము దాల్చినాడవు.
లక్ష్మి (సంపద) విష్ణువుకు భార్య కావున దానిని ముట్టక భిక్షాజీవనం సాగిస్తున్నావు.
ప్రభువులైన వారు సేవకుల స్త్రీల ముట్టరాదు,
అందువలన లక్ష్మీ, సరస్వతుల ఉపయోగము నందు హేయతగలవాడవై
ధైర్య, దయా, దాంతి(తపస్సు), క్షమా, ముక్తులనెడు ఐదింటిని మాత్రమే స్వీకరించితివి.

(8)
త్వత్పాదయో రబ్జసహస్రపూజాం
నేత్రాబ్జపూర్ణాం కృతవత్యుపేంద్రే
త్రినేత్ర నేత్రాబ్జ సహస్ర పూజాం
కుర్వన్నివేంద్ర: ప్రణతో విభాతి.
తాత్పర్యము
త్రయంబకా ! నీ పాదపద్మములకు సహస్రకమలపూజ చేయనెంచిన విష్ణువు,
ఒక కమలము తక్కువై తన నేత్రకమలముతో పూజ పూర్ణము చేసినపుడు
తన వేయికనులనెడు కమలములతో ఇంద్రుడు పూజించి నమస్కరించు చున్నాడా! అన్నట్లుండెను.
~ : ~
(9)
ఆరోప్య వాయుమపి ఖేచరతాం లభంతే
హుత్వా హుతాశమపి వాసవతాం భజంతే
శంభో భవచ్చరణపద్మ మనర్చయంతో
మర్త్యా: కథంచిదపి నాశ్నువతే భవంతం.
తాత్పర్యము
ప్రాణాయామాది సాధనములతో ఆకాశములో తిరగగలరు
యజ్ఞ యాగాదులొనర్చి ఇంద్రపదవిని కూడా సంపాదించగలరు
కాని శంభో నీ పాదపద్మ పూజ చేయనివారు
ఎన్ని ప్రయత్నములు చేసిననూ నిన్ను పొందజాలకున్నారు కదా!
~ : ~
(10)
ఛిత్వా బ్రహ్మశిరో యది ప్రథయతి ప్రేతేషు సఖ్యం యది
క్లీబ: క్రీడతి మాతృభిర్యది రతిం ధత్తే శ్మశానే యది
సృష్ట్వా సంహరతి ప్రజా యది తదాప్యాదాయ భక్త్యా మన
స్తం సేవే కరవాణి కిం త్రిజగతీ శూన్యా స ఏవేశ్వర:
తాత్పర్యము
బ్రహ్మశిరస్సు తృంచిననూ
ప్రేతాలతో స్నేహము చేసిననూ
పురుషత్వము వదిలి సప్తమాతృకలతో ఆడుకొనుచున్ననూ
కాటిలో ప్రేమకల్గి ఉన్ననూ
ఓ చిత్తమా! వానినే కొలుచుచున్నాను
ఏమి చేస్తాం ఈ ముల్లోకాలూ శూన్యమే
వాడొక్కడే ప్రభువు మరి.
~ : ~
(11
వ్యాలేభ్యోస్తు నమ: పిశాచ సదసే న్యస్త: ప్రణామాంజలి
ర్నామ్రా: స్మో నృక పాలదామని చితాభాస్మాభివందామహే
జానుభ్యాం ప్రణిపత్య చాటువచనై స్సంతోషయామో వృషం
కిం కుర్మ: పరమేశ్వరస్య చరితం విజ్ఞాయ వర్తామహే.
తాత్పర్యము
పాములకొక ప్రణామము
పిశాచసభాకొక అంజలి
దయ్యపు పుర్రెలకిదే దండము
కాటిబూడిద కనేక వందనములు
ఆ ఎద్దు సన్నిధిలో మోకాళ్ళపై నుండి ఇదే ప్రార్థిస్తున్నాను
ఏమి చేయగలను మరి? మహేశ్వరుని చేతలు తెలుసుకొని నడచుకొనుచున్నాను.
~ : ~
(12)
ధత్తాం భాస్మన మంగరాగమజినం వస్త్రంచ తారక్షవం
కపాలీం స్రజ మాబిభర్తు కటకం చాహేయ మాముంచతు
భూయశ్చాపి శివేతరాణి భజతాం దైవాస్తథాపి స్వయం
సత్స్వన్యేష్వపి దైవతేషు శివ ఇత్యేక స్సమామ్నాయతే.
తాత్పర్యము
బూడిద పూసుకొనుగాక
గజచర్మము, పులితోలును ధరించుగాక
కపాలమాల వేసికొనుగాక
సర్ప కంకణములు దాల్చుగాక
ఇంకా ఎన్నో అమంగళాలు ఒనర్చుగాక
ఐననూ తానే ప్రభువుకదా!
ఇందరు దేవతలుండగా ఈయనకే
శివుడని (కళ్యాణకరుడని) ప్రఖ్యాతి ఉన్నదిమరి.