శ్రీశైల భ్రమరాంబాష్టకం - తెలుగు
Srishaila Bhramarambha Ashtakam Lyrics - Telugu
రవిసుదాకర వహ్నిలోచన రత్నకుండల భూషిణీ
ప్రవిమలంభుగ మమ్మునేలిన భక్తజన చింతామణి
అవని జనులకు కొంగు బంగారైన దైవ శిఖామణీ
శివుని పట్టపురాణి గుణమని శ్రీగిరీ భ్రమరాంబికా
సోమశేఖర పల్లవాదరి సుందరీమణి ధీమణి
కోమలాంగి కృపాపయోనిధి కుటిల కుంతల ధీమణి
నామనంబున బాయకుండెటి నగకులేశ్వర నందనీ
సీమ లోపల వినుతి కెక్కిన శ్రీగిరీ భ్రమరాంభికా
అక్షయంబుగ కాశిలోపల అన్నపూర్ణ భవానివై
సాక్షిగణపతి గన్నతల్లివి సద్గుణావతి శాంబవీ
మోక్షమోసగెటి కనక దుర్గవు మూలకారణ శక్తివై
శిక్షజేతువు క్రూరజనులను శ్రీగిరీ భ్రమరాంభికా
కలియుగంబున మానవులకూ కల్పతరువై యుండవా
వెలయు శ్రీగిరి శిఖరమందున వైభవముగా నుండియూ
అవనిలోపల భక్తజనులకు నవని దానంబివ్వవా
జిల్కు కుంకుమ కాంతి రీతులు శ్రీగిరీ భ్రమరాంభికా
భూతనాథుని వామభాగము పొందుగా చేకొంటివే
భ్రాంతిగా శ్రీశైలమందున ప్రకాశమై నివసించియూ
పాతకంబులు బారదోలుచు భక్తులను చేకొంటివే
రజితగిరిపై నుండి వెలసిన శ్రీగిరీ భ్రమరాంభికా
మీరు వెలసిన మీ ప్రభావము విష్ణులోకమునందునా
మొల్లవించిన యింద్రలోకము బ్రహ్మలోకము నందునా
వెలమితో కైలాసమందున మూడు లోకములందునా
చెల్లునమ్మా లోక పావన శ్రీగిరీ భ్రమరాంభికా
అంగ వంగ కళింగ కాశ్మీరాంధ్రదేశము నందునా
పొందుగా కర్ణాట కొంకణ పుణ్యభూముల యందునా
రంగుగా కర్నాట లాట మారాట దేశము నందునా
శృంగళా రాజ్యమున వెలసిన శ్రీగిరీ భ్రమరాంభికా
తరుణి శ్రీగిరి మల్లిఖార్జున దైవరాయుని బాలినీ
కరుణతో మమ్మేలు కొన్మిక కల్పవృక్షము భంగినీ
నిత్య మెప్పుడు అష్టకంబును వ్రాసి చదివిన వారికీ
సిరుల నిచ్చుచు నుండ గోరెద శ్రీగిరీ భ్రమరాంభికా
ధరణిలోపల అష్టకంబును విన్నవారికి ఎప్పుడూ
ఘాలి భూత పిశాచ బాధలు చేరకుండగ జూడుమీ
ఇందునున్నా తప్పులెల్లను ఒప్పుగా భావించుమీ
నాదు రక్షింప గోరెద శ్రీగిరీ భ్రమరాంభికా
No comments:
Post a Comment