Kedarnath Jyotirling Mahatmyam - Recent Floods
(स्कंद्पुरण के अनुसार - केदारनाथ यात्रा के समय कोई मानव दर्शन करने से पहलेही
रास्ते में मृत्यु हो गए थो वो पुण्यलोक प्राप्त करेग)
Mahaadri parshvecha thate ramantham, Sampoojyamaanam sathatham muneedraih !
Suraasurai yaksha mahora gaadhyai, Kedaara meesham shiva meesha meede !!
महाद्रि पार्शवेच थटे रमन्थम, सम्पूज्यमानाम सथथम मुनीन्द्रैः !
सुरासुरैयक्ष महोरगाध्यै, केदारमीषम शिवमीषा मीडे!!
శ్రీ కేదారనాథ్ లింగము జ్యోతిర్లింగాలలో అయిదవది. ఈ జ్యోతిర్లింగం స్వయంభువు - ప్రకృతి సిద్దంగా ఏర్పడినట్టిది. కేదారనాథ్ యొక్క సవిస్తార ప్రశస్తి స్కంద పురాణంలోని కేదారఖండంలో విస్తృతంగా
వివరించబడింది. ఈ క్షేత్ర మహిమ వర్ణనాతీతం. కేదార శిఖరమున ఉండే ఈ దేవాలయమునకు పశ్చిమమున మందాకినీ నది, తూర్పున అలకనందా నదీ
ప్రవహిస్తూ ఉంటుంది. మందాకినీ నది తీరంలో కేదారనాథ్ ఉండగా అలకనందా నదీ తీరాన
బదరీనాథ మందిరం ఉంటుంది. రుద్రప్రయాగలో మందాకినీ మరియు అలకనందా నదులు కలియును. ఇవి
రెండు నదులూ కలిసి కొంత దూరం ప్రయాణించి దేవప్రయాగ దగ్గర భాగీరథి నదిలో
(గంగా నది) కలిసిపోతాయి. గంగా నదిలో మునగటం వల్ల కేదారనాథ్, బద్రీనాథ్ ల చరణ
కమలోదకంలో మునిగినట్లై పవిత్రులగు చున్నారు.
హిమాలయాల్లో కొలువుండే ఈ
జ్యోతిర్లింగాన్ని దర్శించిన మానవుడు తన జీవితాన్ని ధన్యం చేసుకున్న వాడవుతున్నాడు.
ఈ లింగాన్ని దర్శించుకోవటం సంవత్సరంలో కేవలం కొన్ని నెలలు మాత్రమె (June-Sept/Oct) వీలవుతుంది. ఆపైన
అక్కడ మంచు పెరుకుపోవటం వాళ్ళ వీలు పడదు. ఆ ప్రాంతమము అతి పవిత్రము - అక్కడ దేవతలు సంచరిస్తుంటారు అని ప్రతీతి - అందుకే
పూర్వ కాలంలో అక్కడ నివాసాలు ఉండేవి కావు.
కాని ప్రస్తుత పరిస్థితి వేరు - అక్కడ నియమ నిబంధనలకు విరుద్దంగా జనావాసాలు
వెలిసాయి - ప్రకృతినీ, పవిత్రతను పాడు చేసి వెక్కిరించాయి. ఫలితం 14 June 2013
న కట్టలు తెంచుకు ప్రవహించి ఉప్పొంగి ముంచెత్తి ఒక్క కేదారనాథ్ ఆలయం తప్ప
అన్నింటినీ తుడిచి పెట్టిన మందాకినీ-అలకనందా నదీమ తల్లులు. ఎవరి స్వార్థానికి ఎవరు బలయ్యారో చెప్పలేం కాని కేదారనాథ్ దర్శనానికి వెళ్లి మరణించిన వారంతా
పురాణవచనం ప్రకారం శివసాయుజ్యం చేరుకున్న పుణ్యాత్ములే.
केदारेश्वर साम्बश्च मुक्थिभागी न संशयः !!
अकृत्या दर्शनम् वैश्य केदारस्याघि नषिणः
यो गच्छेद् बदरीम तस्य यात्रा निष्पलतां भवेतः
केदरेशस्या भक्थाये मार्गस्था स्तस्यवै मृतः !
तेरी मुक्था भवन्त्येव दात्रा कार्य विचारणा !! - Skandapuran
పై శ్లోకాల బట్టి తెలిసేదేమంటే కేదారనాథ్, బద్రినాథ్ లను దర్శించిన వారికి సమస్త
పాపుములు నశించి జీవన్ముక్తి లభించును. ఎవరైనా కేవలం బద్రీనాథుని దర్శించి కేదారనాథుని దర్శించనిచో ఆ యాత్ర
నిష్ఫలమగును. కేదార యాత్రకు బయలు దేరిన వారు మద్యలో
మరనించినను (కేదారనాథుని దర్శనం కాకున్ననూ) పున్యలోకములను పొందును.
No comments:
Post a Comment