శివాభిషేక ఫలములు
- గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.
- నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.
- ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును.
- పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును.
- ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును
- చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును.
- మెత్తని చేక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును.
- మారేడు బిల్వదళ జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును.
- తేనెతో అభిషేకించిన తేజోవృద్ది కలుగును.
- పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును.
- కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును.
- రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును.
- భస్మాభిషేకంచే మహా పాపాలు నశించును.
- గందోదకము చేత అభిషేకించిన సత్పుత్ర ప్రాప్తి కలుగును.
- బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము నశించును.
- నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును.
- అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును. (శివపూజలో అన్న లింగార్చనకు ప్రత్యెక ప్రాధాన్యత కలదు - పెరుగు కలిపిన అన్నముతో శివ లింగానికి మొత్తంగా అద్ది (మెత్తుట) పూజ చేయుదురు - ఆ అద్దిన అన్నాన్ని అర్చనానంతరము ప్రసాదముగా పంచి పెట్టెదరు, చూడటానికి ఎంతో చాలా బాగుంటుంది అన్న లింగార్చన).
- ద్రాక్షా రసముచే అభిషేక మొనర్చిన ప్రతి దానిలో విజయము లభించగలదు.
- ఖర్జూర రసముచే అభిషేకము శత్రుహానిని హరింప జేస్తుంది.
- నేరేడు పండ్ల రసముచే అభిషేకించిన వైరాగ్య సిద్ది లభించును.
- కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించిన చక్రవర్తివ్తము లభించును.
- నవరత్నోదకము చే అభిషేకము ధాన్యము, గృహ, గోవృద్దిని కలిగించును.
- మామిడి పండ్ల రసము చేత అభిషేకము చేసిన దీర్ఘ వ్యాధులు నశించును.
- పసుపు నీటితో అభిషేకించిన మంగళ ప్రదము అగును - శుభ కార్యములు జరుగ గలవు.
No comments:
Post a Comment