హస్తాభ్యాం కలశద్వయామృత రసైరాప్లావయంతం శిరో
ద్వాభ్యాం తౌ దధతం మ్రుగాక్షవలయే ద్వాభ్యాం వహన్తం పరమ్!
అంకస్యస్తకర ద్వయామృతఘటం కైలాసకాన్తమ్ శివమ్
స్వచ్చాంభోజగతం నవేందుముకుటం దేవమ్ త్రినెత్రమ్ భజే !!
తాత్పర్యం:
రెండు చేతులచే అమృత కలశాలను ఎత్తి పట్టుకొన్న వాడై,
మరో రెండు చేతులతో ఆ కలశామృతమును శిరస్సుపై పోసుకుంటున్న వాడై,
మరో రెండు చేతులలో అక్షమాలను, మృగ ముద్రనూ కలిగిఉన్న వాడై,
మరో రెండు చేతులతో రెండు అమృత కలశాలను ఒడిలో పెట్టుకున్న వాడై,
కైలాస ప్రభువై స్వచ్చమైన కమలములపైన కూర్చొని ఉండి,
బాలచంద్రుని శిరస్సున భూషణముగా కలిగి ఉన్నవాడైన త్రినేత్రునికి నమస్కరిస్తున్నాను.
No comments:
Post a Comment