................................................................................Sarvam Shivamayam Jagath.......................................................................
Tuesday, November 29, 2011
Saturday, November 5, 2011
Karteeka Mahatmyam
స్కాంద పురాణం - కార్తీక మహాత్మ్యం
శివరాత్రి తరువాత అంత పవిత్రంగా నేను భక్తి ప్రపత్తులతో మెలిగేవి శ్రావణ, కార్తీక మాసాలు. చాలా చిన్నప్పటి నుండి ఆ రోజుల్లో విశేష పూజలు చేయడం, ఉపవాసాలు ఉండడం జరుగుతుంది. కార్తీక మాసం శివునికే కాక విష్ణువు కూడా ప్రీతి పాత్రమైన మాసం. ఆ రోజుల్లో మన నడవడి, భక్తి ప్రపత్తులకు విశేష పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి, అంతేగాక ఖగోళ శాస్త్ర పరంగానూ ఆ రోజులు విశిష్టతను సంతరించికున్నాయి. కార్తీక మాస విశిష్టత గురించి పలు పురాణాల్లో ప్రస్తావన ఉన్నా స్కాందపురాణంలో తెలుపబడిన విశేషాలు ప్రాధాన్యత కలిగినవి, ఆ పురాణం నుండే గ్రహించి కార్తీక పురాణం పుస్తకాలను ప్రచురించటం జరుగుతుంది. కార్తీక మాసంలో ఆచరిస్తే వచ్చే లాభాలను కొన్నిటిని మూల శ్లోకాలతో ఇక్కడ పొందుపరచి తెలుగు తాత్పర్యాన్ని వ్రాస్తున్నాను.
Importance of Karteeka Monday
Shlokam:
yah karteekemaasinrupa somavaara vratam chareth !
somashekharatushtyartham nayaathi shivamandiram !!
తాత్పర్యం:
కార్తీకమాసమున భక్తితో సోమవార వ్రతమాచారించు వాడు కైలాసమున స్థానము పొందును.
Shlokam:
Karikyaaminduvaarethu snaana daana japaadikam !
ashvamedha sahasraanaam phalam praapnotyasamshayaha !!
తాత్పర్యం:
కార్తీక మాసములో సోమవారమున స్నానము గాని దానము గాని జపము గాని చేసిన యెడల వేయి అశ్వమేధయాగములు చేసిన ఫలము లభించిను, ఆ విషయమై సందేహించ వలసినదే లేదు.
Shlokam:
Streeyovaa purushovaapi kaartikecha induvaasare !
mandalam drushtvaa yah kuryaa nakta bhojanam !
teshaam paapaani nashyanthi vahnou prakshipta toolavath !!
తాత్పర్యం:
స్త్రీలు కాని పురుషులు కాని ఎవరు కార్తీక సోమవారమున నక్షత్రముల జూచి రాత్రి భోజనము చేయుదురో వారి పాతకములు అగ్నియండుంచ బడిన దూది వలె నశించును.
Shlokam:
Streeyovaa purushovaapi kaartikecha induvaasare !
mandalam drushtvaa yah kuryaa nakta bhojanam !
teshaam paapaani nashyanthi vahnou prakshipta toolavath !!
తాత్పర్యం:
స్త్రీలు కాని పురుషులు కాని ఎవరు కార్తీక సోమవారమున నక్షత్రముల జూచి రాత్రి భోజనము చేయుదురో వారి పాతకములు అగ్నియండుంచ బడిన దూది వలె నశించును.
Karteeka Snaana Phalam
Shlokam:
kaarike bhaanuvaretu snaana karma samaacharet !
maasa snaanena yatpunyam tatpunyam labhate nrupa!!
వివరణ:
మాసమంతా స్నానం చేయలేని అశక్తుడు కార్తీక మాసమున ఆదివారమున స్నానము చేసినచో మాసమంతయూ స్నానమాచరించిన పుణ్యము కలుగును.
Shlokam:
aadyentime madyamecha dine yasnaanamaacharet !
maasa snaana phalam tena labhate naatra samshayah !!
వివరణ:
మాసమంతయూ స్నానం చేయటం కుదరని వారు కార్తీక మాస ప్రారంభ దినము శుక్ల పాడ్యమి నాడు, మద్యదినమైన కార్తీక పూర్ణిమ నాడు, చివరిదినమైన కార్తీక అమావాస్య నాడు ఈ 3 రోజులు ప్రాతస్నానానము చేసినచో మాస స్నాన ఫలము లభించును.
Karteeka Deeksha Phalam
Shlokam:
upavaasanchaikabhaktam naktam chaayachitavratam !
Snaanancha thiladaanancha shadvidamkavayo vidhuh !!
తాత్పర్యం:
కార్తీక మాసమునందున 1 ఉపవాసము, 2 ఏకభుక్తము, 3 రాత్రి భోజనము, 4 అయాచిత భోజనము 5 స్నానము, 6 తిలదానము అను ఈ 6 విశిష్టమైనవి.
ఉపవాసము: ఏమీ తినకుండా కేవలం నీరు తాగి ఉండడం.
ఏకభుక్తము: రోజులో ఒక్క పూట మాత్రమె భోజనం చేయడం.
రాత్రిభోజనము: పగటిపూట ఫలహారం తీసుకుని రాత్రి భోజనం చేయడం.
అయాచిత భోజనము: ప్రయత్నం చేయకుండా అనుకోకుండా లభించు భోజనం భుజించుట(లభించనిచో ఉపవాసం)
స్నానం: తెల్లవారక మునుపే తల స్నానమాచారించుట.
తిలదానం: నువ్వులను దానమిచ్చుట (నువ్వులు-బెల్లంతో కూడిన లడ్డూలనూ దానం చేస్తారు)
Karteeka Shivaabhisheka Phalam
Shlokam:
Somavaaretu kartikyaam shivalingaabhishechanam !
Poojanchaivatu naktancha yah kuryaatsashivapriyah !!
తాత్పర్యం:
కార్తీక సోమవారమున శివలింగ అభిషేకము, పూజలు చేసి రాత్రి భోజనము చేయువాడు శివునకు ప్రీతిపాత్రుడు కాగలడు.
Karteeka Deepa Phalam
Shlokam:
karteekamasi saayaahne shivaagaare shubhaprade !
yo deepa marchayedbhaktyaa tadanatha phalapradam !!
తాత్పర్యం:
కార్తీక మాసమున సాయంకాల సమయమున శివాలయములో దీపారాధన చేసినచో అనంతమైన ఫలమునిచ్చును.
Shlokam:
Gopura dvaarashikhare lingaagre nrupapungava !
karikyaam arpayeddeepam sarvapaapaih pramuchyate !!
తాత్పర్యం:
కార్తీక మాసమున శివాలయమున గోపురద్వారమున గానీ, శిఖరము గాని, లింగ సన్నిధిన గానీ దీపారాధన చేసినచో సర్వ పాపములు నశించును.
Shlokam:
Yah kuryaad bhakthi bhaavena kaartikyaa meeshvaraalaye !
Gavyenacha ghrutenaapi tailaadvaa madhutailathah !!
Naaranga tailaad raajendra deepam yasshambhavarpayeth !
Sadhanyassarva dharmajno sadharmaatmaa nasamshayah !!
తాత్పర్యం:
కార్తీక మాసమున శివాలయమున ఆవు నేయితో గాని, నేయితో గాని, నువ్వుల నూనెతో గాని, ఇప్ప నూనెతో గాని, నారింజ నూనెతో గాని భక్తితో దీపము ఉంచునో వాడు ధన్యుడగును. సమస్త ధర్మములు ఎరుగువాడు, ధర్మాత్ముడు అగును.
Shlokam:
yadi thattada bhaavethu kaartikemaasi bhoomipa !
Deepameranda tailaadvaayorpayetsatu punyabhaak !!
తాత్పర్యం:
ముందు శ్లోకమున చెప్పిన నూనెలతో సంభవము కాకున్నా ఆముదముతోనైనా దీపము ఉంచిన పుణ్యాత్ముడు అగును.
Shlokam:
Mohenaivaadhavaa dambhaa dbhaktyaavaa paarvateepate !
Kaartikechaarpayeddeepam sashivapriya baannarah !!
తాత్పర్యం:
కార్తీక మాసమున మొహమున గాని, గొప్పకొరకు గాని, భక్తి తో గాని ఏవిదమైన భావనతో గాని దీపమున్చువాడు శివ ప్రియుడే అగును.
Shlokam:
Toola samshodyavidhinaa vartimkrutvaa prayatnatah!
shaalipishtena tatpaatram godhoomenaadhavaanrupa !!
Kaartikyaakaatayedbhaktyaa ghrutavarti samanvitam !
ghrutapoorita tatpaatram vahnijvaalaa niyojitham !
vipraaya veda vidushe poojya bhaktyaa pradaayeth !!
తాత్పర్యం:
కార్తీక మాసములో పత్తిని ధూళి లేకుండా చక్కగా విడదీసి వత్తిని చేసి బియ్యపు పిండితో లేదా గోధుమ పిండితో పాత్రను చేసి అందులో ఆవు నేతిని పోసి వత్తిని వేసి వెలిగించి సద్బ్రాహ్మణునికి దానమివ్వ వలెను.
Shlokam:
Evam kramena raajendra maasamekam nirantaram !
maasante rajatampaatram vartimkrutvaa suvarnakam!!
shaalipishtasya madyastam krutvaa poojya nivedayet !
braahman bhojayetpaschaatsvayamena tatahparam!
mantrenaanena raajendra kuryaaddanamidam shubham !!
తాత్పర్యం:
పై శ్లోకమున చెప్పిన విధానమున కార్తీక మాసమంతయూ చేసి చివరినాడు వెండి పాత్రను చేసి అందులో బంగారపు వత్తిని వేసి ఒక పల్లెరములోని బియ్యపు పిండి మద్యలో ఉంచి పూజించి నివేదన చేసి ఒక బ్రాహ్మణునికి భోజనము పెట్టి స్వయంగా ఈ క్రింది మంత్రం చదువుతూ దీపాదానము చేయవలెను.
Deepadaana Mantram
Shlokam:
sarvajnaana pradam deepam sarva sampat shubhaavaham!
deepa daanam pradaasyaami shaantirastu sadaa mama!!
తాత్పర్యం:
సర్వజ్ఞాన దాయకము, సమస్త సంపత్తులు కలుగ జేయునది గనుక నేనిపుడు దీప దానమును చేయుచున్నాను, ఈ దీపాదానము వల్ల నాకు నిరంతరమూ శాంతి లభించు గాక.
Karteeka Vana Bhojana Phalam
Shlokam:
Yah kateekesitepakshe vanabhonamaachareth !
sayaathi vaishnavandhaama sarvapapaih pramuchyate !!
తాత్పర్యం:
కార్తీకమాసమున శుక్లపక్షమున వనభోజనము చేయువారికి సమస్త పాపములు నశించును.
Karteeka Vanabhojana Vidhaanam
Shlokam:
naanaa drumalataa keerne vanechaamalakaagratah !
samabhyarchya vidhaanena saalagraama nivaasinam !!
daamodaram jagadvandyam gandha pushpaakshataadibih !
yadhaavittanu saarena vipraamnsapoojya bhaktitah !!
evam ya oorjemaasesmin vanabhojana maacharet !
sasarva paapa nirmuktoyadyatkaalaadi sambhavaih !
tasmaatsarva prayatnena vanabhojana maachareth!!
తాత్పర్యం:
అనేక జాతి వృక్షములతో కూడిన వనమందు ఒక ఉసిరి వృక్షము వద్ద సాలగ్రామముంచి గంధ పుష్పక్షత మొదలగు వాటితో పూజించి తన శక్తిమేర బ్రాహ్మణులను పూజించి వారితో కలిసి భోజనము చేయవలెను. ఇలా వనభోజనము చేసిన వారికి సమస్త పాపములు నశించి విష్ణులోక ప్రాప్తి లభించును. అందువలన తప్పక ఈ వనభోజనమునకై ప్రయత్నించవలెను.
Karteeka Tamboola Daana Phalam
Shlokam:
Taambooladaanam kaarkyaam masamekam nirantaram !
yah kuryaadraaja shaardoola sacha saamraajya mashnute!!
తాత్పర్యం:
కార్తీక మాసం నెల రోజులు నియమముగా తాంబూల దానము చేసినచో మరు జన్మలో ప్రభువు అగును.
Karteeka Pournami Vishishtatha
Shlokam:
pornamyaam kaartikemaasi vrushotsargam karothiyah!
tasya paapaani nashyanthi janmaantara krutaanicha!!
తాత్పర్యం:
కార్తీక పూర్ణిమ నాడు వ్రుషోత్సర్గము (ఆబోతుకు పూజ చేసి స్వేచ్చగా వదిలివేయటం) చేయువారి జన్మాంతర పాపములు నశించ గలవు.
Shlokam:
yo dhaatree phala daanantu pornamyaanchasa dakshinam !
kurute nrupa shaardoola saarvabhoumow bhaveddruvam!!
తాత్పర్యం:
కార్తీక పౌర్ణమి నాడు దక్షిణతో బాటు ఉసిరి పండును దానమిచ్చువాడు సార్వభౌముడగును.
Shlokam:
yah kuryaath deepa daanancha pournamyaam kaartikenagha !
sarva paapa vinirmuktho dathoyaanti paraangatim!
తాత్పర్యం:
కార్తీక పౌర్ణమి నాడు దీప దానము చేయువాడు సర్వ పాపములనుండి ముక్తిని పొంది పరమ పదమును పొందును.
Shlokam:
Shlokam:
lingadaanam pournamaasyaam kaarkyaam shivatusthaye!
iha samyakphalam praapya saarvabhoumow bhaveddruvam!!
తాత్పర్యం:
కార్తీక పూర్ణిమ నాడు లింగ దానము చేయువాడు ఈ జన్మములో అనేక భోగముల అనుభవించు వచ్చే జన్మలో సర్వభౌముడగును.
iha samyakphalam praapya saarvabhoumow bhaveddruvam!!
తాత్పర్యం:
కార్తీక పూర్ణిమ నాడు లింగ దానము చేయువాడు ఈ జన్మములో అనేక భోగముల అనుభవించు వచ్చే జన్మలో సర్వభౌముడగును.
Subscribe to:
Posts (Atom)