Monday, September 26, 2011

Padya Ratnaalu


పద్య రత్నాలు  


నా కిష్టమైన కొన్ని పద్యాలు...........


శివకవులకు నవ కవులకు
శివ భక్తికి, తత్వమునకు, చింతామణికిన్ 
శివలోక ప్రమథులకును 
శివనకు, గురునకు శరణు సేయర వేమా.
                                  (వేమన గారు రచించిన పద్యాల్లో తొలి ప్రార్థనా పద్యం ఇది)

నీరున బుట్టిన యుప్పే
క్షారము నీరాయే, నీరు-క్షారము నొకటే
యీ రీతి శివుని-జీవుని
వారక మది నేరుంగనౌను వసుధను వేమా. 

కట్టెయందు నిప్పు గానని చందమీ
తనువునందు నాత్మ తగిలి యుండు
మఱుగు దెలిసి శివుని మార్కొని చూడరా
విశ్వదాభిరామ వినుర వేమా.

ఆరుగురిని జంపి హరుమీద ధ్యానంబు
నిలిపి నిశ్చయముగ నెగడి యాత్ర 
గతి నేరుంగుచుండు ఘనుడగు యోగిరా 
విశ్వదాభిరామ వినుర వేమా.

మురికి కొంపలోన నిరికించి జీవుని 
గర్మ పాశములను గట్టి వేసె 
నిట్టి కర్మజీవి కెట్లగో మోక్షంబు 
విశ్వదాభిరామ వినుర వేమా.

నీళ్ళు బోసి కడిగి నిత్యంబు శోధించి 
కూడా బెట్టి పైన కోకగట్టి 
యేమి పాటు పడుదురీ దేహ గ్రంధికి 
విశ్వదాభిరామ వినుర వేమా.

ఈకేలనుచు కొన్ని తోకలనుచు కొన్ని
కొకలనుచు కొన్ని గోచులనుచు
కచ్చ మూసివేసి కట్టడి చేసేరా
విశ్వదాభిరామ వినుర వేమా.

భక్తియున్న చోట బరమేశ్వరుడుండు
భక్తిలేని చోట బాపముండు
భక్తి గలుగువాడు పరమాత్మ తానయా
విశ్వదాభిరామ వినుర వేమా.

వేద విద్య గాడు వీర విద్య గాదు
పరమ విద్య గాడు పరువు గాదు
మధురమైనయట్టి మనసు నిల్పెడు విద్య
సాధు విద్య యగును సరగ వేమా. 

భావాభావములంటక
సేవించెడు బట్ట బయలు స్థిరమతి లోనన్
కేవల శివ పరధ్యానము 
తావరమున గన్నవాడే ధన్యుడు వేమా.

ఆది దేవుడగు మహాదేవుమీద నె 
వ్వాని మనసు భక్తి వైభవమున
నుల్లసిల్లు నతని నెల్లకాలముల డ
గ్గరదు సూవే గ్రహ వికార వితతి.
                                 (ఎఱ్ఱన, ఆంధ్ర మహా భారతం)

శివయోగి నొక మాటు చింతింప తడవ
శివభక్తి బొందిన శివయోగి వరుల
నేయే కులమని యెరుక గైకొనకు 
పరుసమోంది యిన్ము పసిడిమైయుండు.
                                ("మనో భోధ" నుండి)

నయమొప్ప సిద్దసనంబున నునిచి
లాలిత హస్త పల్లవమున ముట్టి
ఫాల భాగంబున భసితంబు బెట్టి
హస్త మస్తక యోగ మాచారింపుచును
పరమోపదేశ మీ పట్టున జీవ
                                 (పరమానంద యతి విరచిత (1600 AD) -  "శివజ్ఞాన మంజరి"  నుండి)




Emi Sethura Linga


ఏమీ సేతురా లింగా.......... (తత్వాలు)


నాకు చాలా ఇష్టమైన పాట. ఈపాట నా చిన్న తనంలో రేడియో లో చాలా వచ్చేది. అమ్మ బాగా పాడేది ఈ పాట. బాల మురళి కృష్ణ గారు చాలా చక్కగా పాడారు. అదే ఎక్కువ పొపులర్ అయింది.
నేను ఇప్పటికీ వింటూనే ఉంటాను ఈ పాటను.
ఇందులో విశేషమేమంటే ఎంగిలి అనే జంతువులన్నీ పిల్లలే (పిల్లలు చేసే అల్లరి లాంటిది అనుకోవచ్చు).





 

 Emisetura Linga - Balamurali Audio Video


ఏమీ సేతురా లింగా? ఏమీ సేతురా?

గంగ ఉదకము దెచ్చి నీకూ లింగ పూజలు సేదమంటే.....
గంగ నున్నా కప్ప పిల్ల ఎంగిలంటున్నాది లింగా !
మహాను భావా ! మహాదేవ శంభో ! మా లింగ మూర్తీ ! ఏమీ సేతురా లింగా? ఏమీ సేతురా?

అక్షయావుల పాడి దెచ్చి అర్పితము సేదమంటే.....
అక్షయావుల లేగా దూడ ఎంగిలంటున్నాది లింగా !
మహాను భావా ! మహాదేవ శంభో ! మా లింగ మూర్తీ ! ఏమీ సేతురా లింగా? ఏమీ సేతురా?


తుమ్మి పూవులు దెచ్చి నీకూ తుష్టుగా పూజేదమంటే.....
కొమ్మ కొమ్మన  కోతి పిల్లా ఎంగిలంటున్నాది లింగా !
మహాను భావా ! మహాదేవ శంభో ! మా లింగ మూర్తీ ! ఏమీ సేతురా లింగా? ఏమీ సేతురా?




Sunday, September 25, 2011

YAMAADI DASHAKA LAKSHANA


యమాది దశక లక్షణములు

ఈ క్రింది పది లక్షణములను కలిగి ఉండువాడు ఉత్తముడు అని చెప్పబడును, మనిషి పుట్టిన ప్రతివాడు సాధ్యమైనంత మేర ఈ క్రింది లక్షణాలు అలవారచుకోవటం మంచింది.


Mahaa Lingam by Me 

౧. అహింస: 
యజ్ఞార్థంబగు పశు హింసయే గాక, తక్కిన సకలంబుల యందును, సకల ప్రానులందు క్లేశంబు పుట్టించక యుండుట.

౨. సత్యము:
ఎల్లపుడూ తనకు వచ్చిన ఆపద్భీతులందు అబద్దము చెప్పకుండుట.

౩. అస్తేయము:
శౌచంబునైన, బలత్కారంబు నైన పర ద్రవ్యంబుల అపహరించకున్దుట.

౪. బ్రహ్మచర్యము:
వనితా విలాసంబు గనియును, వినియును మనో వాక్కాయంబుల  మాత్రు  భావంబున ఉండుట బ్రహ్మచర్యము.

౫. క్షమ:
పరులోనరించిన అప్కారంబును సహించుట

౬. ధృతి:
ధనము, పుత్రాదులు వచ్చుట, పోవుటల యందు సంతోషము గాని, దుఃఖము గాని పొందకున్డుట.

౭. దమము:
తోగాదులచే పీదితులగు శత్రు, మిత్రాదుల రక్షింపుట.

౮. ఆర్జవము: 
సుఖ, దుఃఖము లందు బుద్ది చలించకున్డుట.

౯. మితాహారము:
అల్పముగాక, అధికము గాక యోగాను గుణ్యంబుగా భోజనంబు చేయుట

౧౦. శౌచము: 
స్వదేహ మల విమోచానార్థంబై మృత్తికా జలంబు చేతను, మనోమల హరార్థంబై ధ్యానాడులను జేయుట  శౌచము.
(స్నానుదలచే శరీరమును, ధ్యానాదులచే మనస్సును ఎల్లపుడూ నిర్మలముగా నుంచుట)



Saturday, September 24, 2011

Eka Sloki

ఏక శ్లోకి 


ఆది శంకరాచార్య విరచిత 38 రచనల్లో ఒకటి "ఏక శ్లోకి", అది ఒక్క శ్లోకంతో కూడుకున్న మహా రచన. బృహదారణ్యక ఉపనిషత్ లోని నాలుగవ అధ్యాయంలో గల ఒక యజ్నవల్క్య  సంవాదం ఆధారంగా తీసుకుని శంకరాచార్యుల వారు రచించిన గ్రంథమిది. అది నాకు ఎంతో అధ్బుతంగా తోచింది, ఆ ఏక శ్లోకిని తాత్పర్యంతో ఇక్కడ పొందు పరుస్తున్నాను.  ఈ శ్లోకంలో అద్వైత సిద్దాంతాన్నంతటినీ సంగ్రహించి భోదించారు ఆది శంకరుల వారు. 


Advaitha Shankara


శ్లోకం:


కిం జ్యోతిస్తవ భానుమానహనిమేరాత్రా ప్రదీపాదికం,
స్యా దేవం రవి దీప దర్శన విధౌ కిం జ్యోతి రాఖ్యాహిమే  !
చక్షుస్తస్య నిమీలనాది సమమే కిం దీర్థియో దర్శనే,
కిం తత్రాహమతో భవన్పారమకంజ్యోతిస్తదస్మి ప్రభో !!


భావము:

1 వ ప్రశ్న: తవకిం జ్యోతి? = నీకు జ్యోతిస్సు ఏది?
సమాధానం: మే అహనిభానుమాన్, రాత్రౌ ప్రదీపాదికం = నాకు పగలు సూర్యుడు, రాత్రి దీపాదులు జ్యోతిస్సు.

2 వ ప్రశ్న: స్యా దేవం రవి దీప దర్శన విధౌ కిం జ్యోతి రాఖ్యాహిమే? = సరే కాని, సూర్య దీపాదులను గురించి తెలుసుకొనడానికి ఏది నీకు జ్యోతిస్సు?
సమాధానం: చక్షు:  =  అందుకు నా కన్నులే జ్యోతిస్సు.

3 వ ప్రశ్న: తస్య నిమీలనాది సమయే కిం? = కన్నులు మూసుకోవడం వంటి పరిస్థితుల్లో ఏది నీకు జ్యోతిస్సు?
సమాధానం: ధీ: = నా బుద్దియే తేజస్సు.

4 వ ప్రశ్న:  దీయో దర్శనే కిం? = బుద్దిని గురించి తెలుసుకొనుటకు ఏది నీకు జ్యోతిస్సు?
సమాధానం: తత్ర అహం = అందుకు నేనే జ్యోతిస్సును.

గురువు: అతో భావాన్ పరమకం జ్యోతి: = అందుచేత నీవే (ఆత్మ) పరమమైన తేజస్సు అని తెలసి కొనుము.

శిష్యుడు: ప్రభో! తత్ అస్మి = ఓ గురుదేవా! తెలిసినది, ఆ పరమ తేజస్సు నేనే.