యమాది దశక లక్షణములు
ఈ క్రింది పది లక్షణములను కలిగి ఉండువాడు ఉత్తముడు అని చెప్పబడును, మనిషి పుట్టిన ప్రతివాడు సాధ్యమైనంత మేర ఈ క్రింది లక్షణాలు అలవారచుకోవటం మంచింది.
Mahaa Lingam by Me |
౧. అహింస:
యజ్ఞార్థంబగు పశు హింసయే గాక, తక్కిన సకలంబుల యందును, సకల ప్రానులందు క్లేశంబు పుట్టించక యుండుట.
౨. సత్యము:
ఎల్లపుడూ తనకు వచ్చిన ఆపద్భీతులందు అబద్దము చెప్పకుండుట.
౩. అస్తేయము:
శౌచంబునైన, బలత్కారంబు నైన పర ద్రవ్యంబుల అపహరించకున్దుట.
౪. బ్రహ్మచర్యము:
వనితా విలాసంబు గనియును, వినియును మనో వాక్కాయంబుల మాత్రు భావంబున ఉండుట బ్రహ్మచర్యము.
౫. క్షమ:
పరులోనరించిన అప్కారంబును సహించుట
౬. ధృతి:
ధనము, పుత్రాదులు వచ్చుట, పోవుటల యందు సంతోషము గాని, దుఃఖము గాని పొందకున్డుట.
౭. దమము:
తోగాదులచే పీదితులగు శత్రు, మిత్రాదుల రక్షింపుట.
౮. ఆర్జవము:
సుఖ, దుఃఖము లందు బుద్ది చలించకున్డుట.
౯. మితాహారము:
అల్పముగాక, అధికము గాక యోగాను గుణ్యంబుగా భోజనంబు చేయుట
౧౦. శౌచము:
స్వదేహ మల విమోచానార్థంబై మృత్తికా జలంబు చేతను, మనోమల హరార్థంబై ధ్యానాడులను జేయుట శౌచము.
(స్నానుదలచే శరీరమును, ధ్యానాదులచే మనస్సును ఎల్లపుడూ నిర్మలముగా నుంచుట)
No comments:
Post a Comment