Tuesday, January 27, 2015

Karpura Neerajanam

కర్పూర నీరాజనం

Karpura Neerajanam (Photo by Me)


కర్పురామళ జ్యోతిప్రభామయ 
సుప్రమథ గణార్యా శౌర్యా కర్పురామళ
గిరిజావరసుర గిరికార్ముఖవర
గిరిజావరసుర గిరికార్ముఖవర
గిరిధరసుతనాశా....  మహేశా
కర్పురామళ జ్యోతిప్రభామయ 
సుప్రమథ గణార్యా శౌర్యా కర్పురామళ
ఫనిభూషణ వారణచర్మాంబర
ఫనిభూషణ వారణచర్మాంబర
ప్రణవసదాకారా...  వీరా 
కర్పురామళ జ్యోతిప్రభామయ 
సుప్రమథ గణార్యా శౌర్యా కర్పురామళ
వరదాద్వయదిన కరజాహితపుర
వరదాద్వయదిన కరజాహితపుర
హరఘనమఠవాస.... మహేశ
కర్పురామళ జ్యోతిప్రభామయ 
సుప్రమథ గణార్యా శౌర్యా కర్పురామళ


(కర్పూర హారతి తరువాత కర్పూరం బెళగుకునేటప్పుడు చెప్పే శ్లోకం)

కర్పూరగౌరం కరుణావతారం
సంసారసారం భుజగేంద్రహారం
సదావసంతం హృదయారవిందే
భవమ్ భవానీసహితం నమామి


 ~ : ~ 

Monday, January 26, 2015

Dhoopa Harathi

DhoopAarti
ధూప హారతి 

Drawing by me



ధూపాము శివలింగా దుర్జాన భంగ... శివ దుర్జాన భంగ 
ధూపామిష్టాలింగా నీకు దూపాము
బహుజన్మ కృపదోష పరిహారమైన... శివ పరిహారమైన
గుగ్గుళ్ళ ధూపాము గురురాయ నీకు
ధూపాము శివలింగా దుర్జాన భంగ... శివ దుర్జాన భంగ 
ధూపామిష్టాలింగా నీకు దూపాము
ముగ్గూరయ్యలకెంతో మొదామైనట్టి... శివ మొదామైనట్టి
మైసాక్షి ధూపాము మహాదేవ నీకు
ధూపాము శివలింగా దుర్జాన భంగ... శివ దుర్జాన భంగ 
ధూపామిష్టాలింగా నీకు దూపాము
వాసాన సూగంధ వాసానలిచ్చు... శివ వాసానలిచ్చు 
దాశాంగు ధూపాము దవళాంగ నీకు
ఇరవైన సంచార వీరా మహేశా... శివ వీరామహేశ 
వరభక్త వరులకు చాలా దూపాము
ధూపాము శివలింగా దుర్జాన భంగ... శివ దుర్జాన భంగ 
ధూపామిష్టాలింగా నీకు దూపాము
పాలించి మమ్మేలు పంచాకంఠేశా.... శివ పంచాకంఠేశ
లీలా సద్గుణరాయ నీకు దూపాము
ధూపాము శివలింగా దుర్జాన భంగ... శివ దుర్జాన భంగ 
ధూపామిష్టాలింగా నీకు దూపాము
శివసాంబ శివమూర్తి శృంగారవర్తి... శివ శృంగారవర్తి
శివభక్త వరులకు చాలా ధూపాము
ధూపాము శివలింగా దుర్జాన భంగ... శివ దుర్జాన భంగ 
ధూపామిష్టాలింగా నీకు దూపాము



~:~ 







Wednesday, January 14, 2015

Veerabhadra Mangala Harathi

శ్రీ వీరభద్ర స్వామి మంగళ హారతి
Shri Veerabhadra Swamy Mangala Harathi



Shri Veerabhadra Swamy, Patalaganga-Srishailam (Photo by Me)




భద్రమంగళం వీరభద్రమంగళం - భద్రకాళి మనోహరా భవ్యమంగళం 
అలదక్షుడు యాగంబును అహంకార పూరితుడై 
శూలిననాదరము సేయ శోషణ పాల్జేసినట్టి 
భద్రమంగళం వీరభద్రమంగళం - భద్రకాళి మనోహరా భవ్యమంగళం 
దాక్షాయణి అనుమానపు తాపగ్నిని కుమిలి కుమిలి
దక్షయజ్ఞ కుండికబడ దక్షుని శిక్షించినట్టి
భద్రమంగళం వీరభద్రమంగళం - భద్రకాళి మనోహరా భవ్యమంగళం 
హరుడు జటాజూటమ్మును ఆర్చి శిలను తాడించగ
పరమేశ్వరుకోపాగ్నిని ప్రభవించిన ప్రళయరుద్ర
భద్రమంగళం వీరభద్రమంగళం - భద్రకాళి మనోహరా భవ్యమంగళం 
దక్షుని ఆహ్వానంబున తగుదుమంచు నరుదెంచిన
దక్షురుక్ష సురవీరుల శిక్షించిన రుక్షాక్షా 
భద్రమంగళం వీరభద్రమంగళం - భద్రకాళి మనోహరా భవ్యమంగళం 
దక్షయజ్ఞ ధ్వంసంబును దక్షతతో గావించియు 
దక్షుని శిరమును ద్రుంచి విచక్షణతొ విహరించిన
భద్రమంగళం వీరభద్రమంగళం - భద్రకాళి మనోహరా భవ్యమంగళం
హరి నృసింహునవతారము అంతము వికృతంబు కాగ
నరసింహుని నిర్జించిన శరభమూర్తి వీరభద్ర
భద్రమంగళం వీరభద్రమంగళం - భద్రకాళి మనోహరా భవ్యమంగళం 
హరవరసుత వీరభద్ర ఆర్తిజన దయాసముద్ర
శరణగణ సమూహ సహిత శంకరాఖ్య కవి వినుతా
భద్రమంగళం వీరభద్రమంగళం - భద్రకాళి మనోహరా భవ్యమంగళం 


~ : ~ 




Wednesday, January 7, 2015

Pushpanjali




  
పుష్పాంజలి 

ఉత్సాహంబున మోక్షదాయక ఇచ్చెదనొక పుష్పాంజలియో
సచ్చరిత్ర శివ సర్వేశ్వర నీకిచ్చెద నొక పుష్పాంజలియో

కమల భవార్చిత కమలాధిప కమలాంచిత కరకమలయని
శమన దమన భవశమన సురార్చిత విమలచరిత పుష్పాంజలియో    
  !! ఉత్సాహంబున!!

రాజరాజ సఖ రాజమకుట ఫణిరాజ భూషమహతేజయని
దీనజనావళి సురభూజవరద విభ్రాజిత నిదె పుష్పాంజలియో
 !! ఉత్సాహంబున!!

అగణిత వైభవ సుగుణార్చిత యోగి గణార్చిత పదయుగళయని
నిగామాశ్వపదనగజా కళత్ర జగదారాధన పుష్పాంజలియో
 !! ఉత్సాహంబున!!

మండిత విభవా ఖండల జిత దోర్దండ గోత్ర కోదండయని
పాండుర దేహ ప్రచండయని దుష్టజనఖండన నిదె పుష్పాంజలియో
 !! ఉత్సాహంబున!!

చారుకుంద  కరవీర వకుళ మందార బిల్వచయ హారములన్
సారెకు మిము నుతి జేయుచు మీకడ జేరితినిక పుష్పాంజలియో
 !! ఉత్సాహంబున!!

నీరహర డిండీర కీర్తిజిత చారు వినిర్మల తేజయనీ 
వారణదైత్య విచారణ పరమోదార భరిత పుష్పాంజలియో
 !! ఉత్సాహంబున!!

నీలకంఠ హృత్కీల చరాచర పాలిత భీమ త్రిశూలయనీ 
హాలాహల గళకంధర కపాల నిదె పుష్పాంజలియో

వర సిద్దులూరు పుర మందిర సుస్థిర సంపదలిడు సర్వేషయని 
గురుజేసుక నీ చరణ కమలము మదిలో నిల్పితి పుష్పాంజలియో
 !! ఉత్సాహంబున!!






Saturday, December 13, 2014

Bilhanastavam

బిల్హణస్తవము




అత్యంత శివప్రీతికరమైన, మృదుమధురమైన ప్రసిద్దమైన మహిమ్న, మల్హణ, మలయరాజ, అనామయ, హలాయుధ మనెడు శివపంచస్తవములతో బాటు 11వ శతాబ్దములో బిల్హణకవిచే రచించబడిన బిల్హణస్తవము కూడా ఎంతో ప్రసిద్ది నొందినది.  ఈ బిల్హణస్తవముకై నెట్ లో వెతికితే నాకు ఎక్కడా ఏ భాషలోనూ కనిపించలేదు. ఎంతో శ్రవణానందమయమైన  ఈ స్తవమును బిల్హనుడు బహు చమత్కారంగా శివుని స్తుతిస్తూ రచించాడు. అందులో కొన్నిటిని ఇక్కడ పొందుపరుస్తున్నాను.  


(1)
సంతు సహస్రం దేవాస్తద్గుణ దోశోక్తిభిః కి మస్మాకం 
శివమేవ వర్ణయామ: పునరపి శివమేవ శివమేవ.  

తాత్పర్యము
వేలకొలది దేవతలుందురు గాక !
వారి గుణదోషములతో మాకేమి పని ?
మేము శివునే వర్ణింతుము. 
మరల.... మరల.... శివునే స్మరింతుము. 

~ : ~ 


(2)
ధత్సే మూర్థ్ని సుధామయూఖశకల శ్లాఘ్యే కపాలస్రజం
వక్షస్యద్రిసుతాకుచాగురురజస్సాంద్రే చితాభస్మాచ
తద్భాణాది కవి ప్రణీత లలిత స్తోత్ర ప్రబంధప్రియే
త్వత్కర్ణే లభతామయం మమ గిరాం  గుంభోపి సంభావనాం. 

తాత్పర్యము
అమృతకిరణములుగల చంద్రరేఖను ధరించిన తలకు - పుర్రెలదండను దాల్చినావు. 
పార్వతీదేవి స్తనముల అగరు పూతలు దట్టముగా అంటియున్న వక్షస్థలముననే - కాటిబూడిద అలదినావు.  
అలాగే బాణాది కవీశ్వరులచే రచించబడిన సుందరమైన కావ్యముల విని ఆనందించిన నీ కర్ణముననే - నా ఈ మాటల వరుసయూ మన్నన పొందునుగాక. 

~ : ~


(3)
పంచబ్రహ్మషడంగబీజ ముఖర ప్రాసాద పంచాక్షర 
వ్యోమవ్యాపి పురస్సరేషు మనుషు ప్రౌఢి: కుతో మదృశాం  
ఒంకారాదినమోంత  ముద్రిత భవన్నామావళీకల్పితం 
సర్వం మంత్రతయా ప్రభో పరిణమత్యంతర్భహిర్యోగత:

తాత్పర్యము
ప్రభో ! సద్యోజాతాది పంచబ్రహ్మముల యొక్క వశ్యాకర్షనాది 
షడంగ బీజాక్షరముల చేత మిక్కిలి గొప్పదగు ప్రసాద పంచాక్షరి యొక్క 
అక్షరములతో భూనభోంతరాళములు నిండుకొను మహామంత్రములలో 
మాబోంట్లకు పాండిత్య మెక్కడిది? 
"ఓం"కారమును ఆదియందును "నమః"  శబ్దమును అంత్యమందునూ 
నీ నామదేయములకు ముందువెనకాల చేర్చినచో అన్నీ కూడా మంత్రస్వరూపము అయిపోవు చున్నది. 
~ : ~


(4)
ప్రాసాదైస్తవ కిం శ్మశానవసతే: స్నానై: కి మస్థి స్పృశ:
కిం వస్త్రైశ్చ దిగంబరస్య భాసితాలేపస్య  గంధైశ్చ కిం 
కిం ధూపై: శవధూమధూమ్రపపుష: కిం కాలకూటాశినో   
నైవేద్యైరితి భక్తిమాత్రసులభం త్వాం దేవా సేవామహే.

తాత్పర్యము
ఈశ్వరా! శ్మశానములో ఉండేవానికి ఆలయముతో నేమి?
ఎముకలు దాల్చువానికి అభిషేకమేల? 
దిగంబరునికి పట్టువస్త్రాలతో పనేమీ?
బూడిద రాసుకొనే వానికి గంధముతో అవసరమేమి?
శవాల పొగచే నల్లనైన వానికి ధూపంతో ఇంకేమి పని?
ఈ విధంగా భావించి ఓ పరమేశ్వరా!
నిను భక్తిమాత్రముననే సులభునిగా తలచి సేవించుచున్నాను. 

~ : ~

(5)
ఉత్తరంగ మధిమస్తకగంగావారి ధారయాసి వారిజగంధి   
కిం పయై శ్చుళుక బిల్వదళైస్తే భిక్షురుజ్జతి కదాచన లాభం.

తాత్పర్యము
ఉన్నత తరంగాలు కలిగిన, కమలముల సుగంధములు కలిగిన గంగాజలన్నే తలలో దాల్చినావు గదా!
అయినా దోసెడు నీటి అభిషేకం, గుప్పెడు మారేడుపత్రితో నీకవసరమేమీ?
అంతేలే! భిక్షమడుక్కునేవాడు ఏ చిన్నదాన్నైనా వదులుకుంటాడా? 
~ : ~


(6)
సస్యారోపణరక్షణా క్షమతయా భిక్షాటనం నిర్మితం 
కచ్చ గ్రంధనమోచనాలసతాయ వసో దిశః కల్పితాః 
శాణాన్వేషణ ఘర్షణా సహతాయ భస్మాంగరాగః కృతః 
విశ్వోత్పాదనరక్షణాప హరణాయా సస్త్వాయ నేక్షిత:

తాత్పర్యము
విత్తనాలు నాటుకొనలేక బిచ్చమెత్తుకొనుచుంటివి !
చెంగులు దీసి కట్టుకొని విప్పుటకు ఓపిక లేక దిగంబరునిగా తిరిగుచుంటివి !
సానెదెచ్చి గంధము తీయలేక బూడిద పూసుకోను చున్నావు !
అయితే  శంభో ఈ ప్రపంచాన్ని పుట్టించుట, పోషించుట, గిట్టించుటల యొక్క  ఆయాసాన్ని మాత్రం ఎందుకు నీవు లెక్కించుట లేదు?

~ : ~


(7)
వాణీ పంకరుహాసనస్య గృహిణీత్యాస్థాయి మౌనవ్రతం 
లక్ష్మీ: సాగారశాయిన: ప్రియతమే త్యగ్రాహి భిక్షాటనం
ఇత్థం స్వామినిషిద్ద సేవక వధూ సంభోగబీభత్సయా 
పంచాసేవిషత త్వయా దృతిదయదాంతి క్షమా ముక్తయ:

తాత్పర్యము
వాణి (మాట) బ్రహ్మకు భార్య కావున దానినంటక మౌనము దాల్చినాడవు. 
లక్ష్మి (సంపద) విష్ణువుకు భార్య కావున దానిని ముట్టక భిక్షాజీవనం సాగిస్తున్నావు. 
ప్రభువులైన వారు సేవకుల స్త్రీల ముట్టరాదు,
అందువలన లక్ష్మీ, సరస్వతుల ఉపయోగము నందు  హేయతగలవాడవై
ధైర్య, దయా, దాంతి(తపస్సు), క్షమా, ముక్తులనెడు ఐదింటిని మాత్రమే స్వీకరించితివి.
~ : ~


(8)
త్వత్పాదయో రబ్జసహస్రపూజాం
నేత్రాబ్జపూర్ణాం కృతవత్యుపేంద్రే 
త్రినేత్ర నేత్రాబ్జ సహస్ర పూజాం
కుర్వన్నివేంద్ర: ప్రణతో విభాతి.

తాత్పర్యము
త్రయంబకా ! నీ పాదపద్మములకు సహస్రకమలపూజ చేయనెంచిన విష్ణువు, 
ఒక కమలము తక్కువై తన నేత్రకమలముతో పూజ పూర్ణము చేసినపుడు
తన వేయికనులనెడు కమలములతో ఇంద్రుడు పూజించి నమస్కరించు చున్నాడా! అన్నట్లుండెను. 

~ : ~


(9)
ఆరోప్య వాయుమపి ఖేచరతాం లభంతే
హుత్వా హుతాశమపి వాసవతాం భజంతే
శంభో భవచ్చరణపద్మ మనర్చయంతో 
మర్త్యా: కథంచిదపి నాశ్నువతే భవంతం.


తాత్పర్యము
ప్రాణాయామాది సాధనములతో ఆకాశములో తిరగగలరు
యజ్ఞ యాగాదులొనర్చి  ఇంద్రపదవిని కూడా సంపాదించగలరు 
కాని శంభో నీ పాదపద్మ పూజ చేయనివారు
ఎన్ని ప్రయత్నములు చేసిననూ నిన్ను పొందజాలకున్నారు కదా!

~ : ~


(10)
ఛిత్వా బ్రహ్మశిరో యది ప్రథయతి ప్రేతేషు సఖ్యం యది
క్లీబ: క్రీడతి మాతృభిర్యది రతిం ధత్తే శ్మశానే యది
సృష్ట్వా సంహరతి ప్రజా యది తదాప్యాదాయ భక్త్యా మన
స్తం సేవే కరవాణి కిం త్రిజగతీ శూన్యా స ఏవేశ్వర:


తాత్పర్యము
బ్రహ్మశిరస్సు తృంచిననూ 
ప్రేతాలతో స్నేహము చేసిననూ
పురుషత్వము వదిలి సప్తమాతృకలతో ఆడుకొనుచున్ననూ
కాటిలో ప్రేమకల్గి ఉన్ననూ 
ఓ చిత్తమా! వానినే కొలుచుచున్నాను
ఏమి చేస్తాం ఈ ముల్లోకాలూ శూన్యమే
వాడొక్కడే ప్రభువు మరి.

~ : ~


(11
వ్యాలేభ్యోస్తు నమ: పిశాచ సదసే న్యస్త: ప్రణామాంజలి 
ర్నామ్రా: స్మో నృక పాలదామని చితాభాస్మాభివందామహే
జానుభ్యాం ప్రణిపత్య  చాటువచనై స్సంతోషయామో  వృషం
కిం కుర్మ: పరమేశ్వరస్య చరితం విజ్ఞాయ వర్తామహే. 

తాత్పర్యము
పాములకొక ప్రణామము
పిశాచసభాకొక అంజలి
దయ్యపు పుర్రెలకిదే దండము 
కాటిబూడిద కనేక వందనములు
ఆ ఎద్దు సన్నిధిలో మోకాళ్ళపై నుండి ఇదే ప్రార్థిస్తున్నాను
ఏమి చేయగలను మరి? మహేశ్వరుని చేతలు తెలుసుకొని నడచుకొనుచున్నాను.

~ : ~


(12)
ధత్తాం భాస్మన మంగరాగమజినం వస్త్రంచ తారక్షవం
కపాలీం స్రజ మాబిభర్తు కటకం చాహేయ మాముంచతు 
భూయశ్చాపి శివేతరాణి భజతాం దైవాస్తథాపి స్వయం
సత్స్వన్యేష్వపి  దైవతేషు శివ ఇత్యేక స్సమామ్నాయతే.


తాత్పర్యము
బూడిద పూసుకొనుగాక 
గజచర్మము, పులితోలును ధరించుగాక 
కపాలమాల వేసికొనుగాక 
సర్ప కంకణములు దాల్చుగాక
ఇంకా ఎన్నో అమంగళాలు ఒనర్చుగాక
ఐననూ తానే ప్రభువుకదా!
ఇందరు దేవతలుండగా ఈయనకే
శివుడని (కళ్యాణకరుడని) ప్రఖ్యాతి ఉన్నదిమరి.





Saturday, November 29, 2014

Oum is Shiva




ఓం యొక్క పుట్టుక 
ఈ జగత్తులో అతి పురాతనమూ, సనాతనమూ అయినట్టివి వేదాలు.
వేదాలు పరమశివుని ముఖాలనుండి వెలువడినవి. 
ఇందులో ప్రధానమైన 3 వేదాల నుండే ఓం యొక్క పుట్టుక జనించింది
ఓం అనునది 3 అక్షరాల కలయిక
అ+ఉ+మ్ = ఓం 
మొదటి వేదం ఋగ్వేదములోని మొదటి ఋక్కు (గ్నిమీళే పురోహితమ్)  లోని మొదటి అక్షరం  
రెండవ వేదం యజుర్వేదంలోని మాద్యమ మంత్రం (యోని సముద్రో బందు) లోని మద్య అక్షరం
మూడవ వేదం సామవేదంలోని చివరి మంత్రం (అసమానంతరమ్) లోని చివరి అక్షరం మ్ 



అథర్వోపనిషత్ (అథర్వశిరశోపనిత్)

య: ఓంకార: స ప్రణవ: యః ప్రణవ: స సర్వ వ్యాపీ
య: సర్వ వ్యాపీ సో అనంతః యో అనంతస్తత్తారమ్ యత్తారమ్ 
తత్సూక్ష్మం యత్సూక్ష్మం తచ్చుక్లమ్ యచ్చుక్లమ్ 
తద్వైద్యుతమ్ యద్వైద్యుతం తత్పరం బ్రహ్మ
స ఏకోరుద్రః స ఈశాన: స భగవాన్ మహేశ్వర: స మహాదేవ:


అర్థము:
ఏది ఓంకారమో అదియే ప్రణవము, ఏది ప్రణవమో అదియే సర్వవ్యాపి 
ఏది సర్వవ్యాపియో అదియే అనంత శక్తియుత స్వరూపి ఉమయు,
ఉమయే తారకమంత్రమైన బ్రహ్మవిద్య
ఏది తారకమో అదియే సూక్ష్మ జ్ఞానశక్తి
ఏది సూక్ష్మమో అదియే శుద్దము
ఏది శుద్దమో అదియే విద్యుత్ అధిష్టాతి ఉమ అనబడును
ఏది ఉమాయో అదియే పరబ్రహ్మము 
అదియే అద్వితీయ రుద్రుడు  
అతడే ఈశానుడు 
అతడే భగవాన్ మహేశుడు 
అతడే మహాదేవుడు.




You can find more about Atharvasheerashopanishad matter in English here:
 http://www.vedarahasya.net/atharvasiras.htm





Monday, November 24, 2014

Shiva Pradakshina Stotras


శివ ప్రదక్షిణ స్తోత్రములు 






Shlokam 1:
Atmaatvam girijaapatissahacharah praanaasshareeram gruham
poojaathe vishayopabhogarachanaa nidraa samaadi sthithih
sanchaarah padayoh pradakshinavidhi strotraani sarvaagiro
yadyatkarma karomi thatthadakhilam shambo tavaaraadhanam

Shlokam 2:
Urasaa shirasaa drushtvaa manasaa vaachaa thathaa
padaabhyaam karaabhyaam karnaabhyaam pranaamoshtanga uchyathe


Shlokam 3:
Yanikanichapaapaani, Janmaanthara krutanicha
Taanitaani pranasyanthi, Pradakshina Padepade
Paapoham paapakarmaaham, Paapaatma Paapasambava
Traahimaam krupayaadeva, Sharanaagatavatsala
Anyadaa sharanam naasthi, Tvameva sharanam mama
Tasmaath kaarunyabhaavena, Raksharaksho Maheshvara


Shlokam 4:
Vande shambhumumaapathim suragurum vande jagatkaaranam
vande pannagabhooshanam mrugadharam vande pashoonaampathim
vande sooryashashaankavahni nayanam vande mukundapriyam
vande bhaktajanaashrayancha varadam vande shivamshankaram.


Shlokam 5:
Karacharanakrutamvaa karma vaakkaayajamvaa 
shravananayanajamvaa maanasamvaaparaadham
vihitamahivithamvaa sarvamethath kshamasvaa
shivashiva karunaabde sree mahaadeva shambho.

Shlokam 6:
Paurohityam rajanicharitam graamaanvitam niyogam
mataapatyamhi yanrutavachanam saakshivaadah paraannam
brahmadveshah khalajanarathih praaninaam nirdayatvam
maabuddevo mamapashupathe janmajanmaanthareshu
kshantajyomeparaadha shivashivabho sree mahadeva shambho.


Shlokam 7:
Yadakshara padabhrashtam, maatraaheenancha yadbhaveth
tatsarvam kshamyataamdeva, sadaashiva namosthuthe.



శ్లోకం 1:
ఆత్మాత్వం గిరిజాపతిస్సహచరః, ప్రాణాశ్శరీరం గృహం
పూజాతే  విషయోపభోగరచనా, నిద్రా సమాది స్థితి:
సంచారః పదయో: ప్రదక్షిణవిధి: స్త్రొత్రాణి సర్వాగిరో
యద్యత్కార్మకరోమి తత్తదఖిలం శంభో తవారాధనమ్. 


శ్లోకం 2:
ఉరసా శిరసా దృష్ట్వా, మనసావాచా తథా !
పాదాభ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం, ప్రణామోష్టంగ ఉచ్యతే !!


శ్లోకం 3:
యానికానిచ పాపాని, జన్మాంతర కృతానిచ
తానితాని ప్రణస్యంతి, ప్రదక్షిణ పదేపదే
పాపోహం పాపకర్మాణాం, పాపాత్మా పాపసంభావా
త్రాహిమాం కృపయాదేవ శరణాగతవత్సల 
అన్యదాశరణం నాస్తి, త్వమేవశరణం మమ.
తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్షో మహేశ్వర. 


శ్లోకం 4:
వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం
వందే పన్నగ భూషణం మృగధరమ్ వందే పశునాంపతిం
వందే సూర్యశశాంకవహ్ని నయనం వందే ముకుందప్రియం
వందే భక్త జనాశ్రయంచ వరదం వందే శివంశంకరం. 

శ్లోకం 5:
కరచరణకృతంవా కర్మ వాక్కాయజంవా
శ్రవణనయనజంవా మానసంవాపరాధమ్
విహిత మహివితంవా సర్వమేతత్ క్షమస్వ
శివశివ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో.


శ్లోకం 6:
పౌరోహిత్యం రజనిచరితమ్ గ్రామాన్వితం నియోగం
మఠాపత్యంహ్యనృతవచనం సాక్షివాదః పరాన్నం 
బ్రహ్మద్వేష: ఖలజనరతి: ప్రాణినాం నిర్దయత్వం 
మాబుద్దేవో మమ పశుపతే జన్మజన్మాంతరేషు  
క్షంతజ్యోమేపరాధ శివశివభో శ్రీమహాదేవశంభో. 



శ్లోకం 7:
యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ 
తత్సర్వం క్షమ్యతామ్ దేవ సదాశివ నమోస్తుతే. 





Wednesday, November 19, 2014

Vaidyanatha Vaidika Stotra Panchakam

Sri Vaidyanatha Vaidika Stotra Panchakam



శ్రీ వైద్యనాథ వైదిక స్తోత్ర పంచకం 

ఆతార్యాయ నిషంగిణే కవచినే కాట్యాయ నీప్యాయ చ
శీభ్యాయేషుమతే నమః ప్రతరణాయో ర్మ్యాయ హ్రస్వాయ చ
తామ్రాయ ప్రహితాయ చేషుధిమతే వన్యాయ ఫేన్యాయ చ 
స్రోతస్యాయ చ వామనాయ చ నమః శ్రీ వైద్యనాథాయ తే.

దుందుభ్యాయ నమో భవాయ చ నమస్తీర్థ్యాయ కుల్యాయ చ
వైశంతాయ సుధన్వనే గిరిచరా యోగ్రాయ భీమాయ చ
ఉర్వర్యాయ నమః శివాయ బృహతే వృద్ధాయ సంవృద్ ధ్వనే
శ్రేష్టాయాస్తూ మయస్కరాయ చ నమః శ్రీవైద్యనాథాయ తే. 

క్షేత్రాణాం పతయేరుణాయ చ నమో వర్షీయసే శంభవే 
వృక్షాణాం పతయే నమః పరిచరాయోష్ణిషిణే మంత్రిణే 
కక్షాణాం పతయే దిశాం చ పతయే శంగాయ తే ధావతే 
సత్వానాం పతయే హిరణ్యపతయే శ్రీవైద్యనాథాయ తే. 

జ్యేష్ఠంమేస్తుప్రియం ధనంచ సుకృతం విశ్వం యశోమేఋతం
భూతం చ క్రతురస్తు మే చ మహిమా శ్రోతం బలం మే స్వరః 
భద్రం మే ద్రవిణం మతిశ్చ సుమతి: శర్మాస్తు చిత్తం చ మే 
శ్రేయః శం చ తనుశ్చ మేస్తు సుదినం శ్రీ వైద్యనాథ ప్రభో. 

యస్తామ్రోరుణ ఈశ్వర: శితవమో మీఢుష్టమః శంకరః 
యేనేదం భువనం చ భవ్యమమృతం భూతం భవిష్యత్ స్మృతం 
యం జానంతి బుధాః శృతం చ పురుషం కృత్తిం వసానం మహః 
సోస్మాన్ పాతు మహేశ్వరస్తు   పరళీ శ్రీ వైద్యనాథ: శివః.
  
ఈ స్తోత్ర పంచకం  కాశీ విశ్వారాద్య జగద్గురు శ్రీ వీరభద్ర శివాచార్య స్వామి గారిచే రచించబడినది. 


Tuesday, July 16, 2013

Linga Tatvam

(From Veda, Upanishath, Agama, Smruthi, Puranas)




What is Lingam
(Lingam is a God Particle)

 
"Leenam Gamayatheethi Lingam"

Leeyathe Yatra Bhootaani Nirgacchanthi Yatah Punah !
Thena Lingam Param Vyoma Nishkalah Paramah Shivah !!

Leenam Prapancha Roopaahi Sarva Methath Charaacharam !
Sarvadaa Gamyathe Bhooyaa Sthasmaa Linga Mudeerithim !!

Sarvasya Charaacharaatmakasya Prapanchasya Yallingam Prabhava Leenasthaanam !
LeeyatesminAnthakaale Jagatsarvam Srushtikaale Bahirgacchatheethi Lingam !!

Leeyathe Gamyathe Yathra Yena Sarvam Charaacharam !
Thade ThallingaMithyuktham Linga Thathva Vishaaradaih !!

Aakaasham Linga Mithaahuh Pruthivee Thasyaadi Peetikaa !
Aalayam Sarva Bhoothaanaam Layanaam Linga Muchyathe !!

Linga Garbhe Jagatsarvam, Trailokyam Sa Charaacharam !
Linga BaahyaathParam Naasthi, Tasmaallingam Prapoojayeth !!

Layam Gacchathi Yatthaiva Jagadethath Charaacharam !
Punah Punah Samutpatthim Tallingam Brahma Shaashvitham !!

Tasmaallinga Mithikhyaatham SathAananda Chidaatmakam !
Bruhatthaath  BrahmanaTvaaccha Brahma ShabdaaBhideyakam !!





How is Lingam
(Small than Smallest- Big than Biggest)


"Yatho Vaatho Nirvarthanthe Apraaprya Manasaasaha"
"AnorAneeyaan Mahatho Maheeyaan"
"SookshamthSookshmatharam"
"AthyathistadDashaangulam"
"ChakithaMabhidatthe Shruthirapi"

Sarvam Khalividam Brahma, Lingam ThathBrahma Sangatham !!
Tallingam Brahma Shaashvatham, Lingam BrahmaSsanaathanam !!

Thallingam ParamamBrahma Sacchidaananda Lakshanam !
Nijaroopa Mithi DhyaanaaTthadavasthaa Prajaayathe !!

MahaalingaMidam Devi ManotheethaMagocharam
Nirnaama Nirgunam Nityam Niraamaya Niranjanam
Nirmalam Nishkalam Jneyam Nirbhedyam Nirupaadhikam
AdvaithaanandaMaksheena Masaadrushyamidam Shrunu
AlakshyaMadvayam ShoonyamAmoortham Padamavyayam
Akulaanaamayam ShuddaManaadyam Shiva Muchyathe
Oordhva ShoonyaMadhahShoonyam Madhya Shoonya Svaroopakam
Aadi Madyaancha Shoonyancha Nishkalam Deha Varjitham

Aroopam Nishkalam Brahma, Bhaavaatheetham Niranjanam !
Shabdaadi Vishayaatheetham, Moola LingamIhochyathe !!


Lingam Saakaara Roopam
(Lingam is Shiva)

Jwaalaamaalaa Vrutangaaya JwalanaSthambha Roopine !
Namasshivaaya Shaanthaaya Brahmane Linga Roopine !!

Brahma Prajananam Kootam PavitramAmrutham Savah
Prastharo Janima Praano Devo Lingam Thadaivacha
Paryaaya Vaachakaa Yethe Lingasya Paramaatmanah 

Athah Sacchidaananda Lakshanah Parameshwarah !
Swayameva Sadaalingam Nalingam Tasya Vidyathe !!

Athah Shivassarva JagathVibhaavakah SvayamPrakaashah Svayameva Kevalah !
Mayoditho Lingamithi DvijarshabhaaStadeva Poojyam  ShruthiMasthakathatham !!

"Shivaroopah Praanalingi"

Brahmethi Lingamaakhyaatham Brahmanah Pathi Reeshwarah !
Pavitram ThaddVikhyaatham TatramParkaatThanuh Shuchih !!
 





Monday, July 1, 2013

Shivabhisheka Phalam





శివాభిషేక  ఫలములు  

  1. గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.
  2. నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు. 
  3. ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును. 
  4. పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు  లభించును.
  5. ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును
  6. చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును.
  7. మెత్తని చేక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును. 
  8. మారేడు బిల్వదళ జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును.
  9. తేనెతో అభిషేకించిన తేజోవృద్ది  కలుగును.
  10. పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును. 
  11. కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును. 
  12. రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును.
  13. భస్మాభిషేకంచే మహా పాపాలు నశించును. 
  14. గందోదకము చేత అభిషేకించిన సత్పుత్ర  ప్రాప్తి కలుగును.
  15. బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము నశించును. 
  16. నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును.
  17. అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును.           (శివపూజలో   అన్న లింగార్చనకు ప్రత్యెక ప్రాధాన్యత కలదు - పెరుగు కలిపిన అన్నముతో శివ లింగానికి మొత్తంగా అద్ది (మెత్తుట) పూజ చేయుదురు - ఆ అద్దిన అన్నాన్ని అర్చనానంతరము ప్రసాదముగా పంచి పెట్టెదరు, చూడటానికి ఎంతో చాలా  బాగుంటుంది అన్న లింగార్చన).
  18. ద్రాక్షా రసముచే అభిషేక మొనర్చిన ప్రతి దానిలో విజయము లభించగలదు.
  19. ఖర్జూర రసముచే అభిషేకము శత్రుహానిని హరింప జేస్తుంది.
  20. నేరేడు పండ్ల రసముచే అభిషేకించిన వైరాగ్య సిద్ది లభించును.
  21. కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించిన చక్రవర్తివ్తము లభించును. 
  22. నవరత్నోదకము చే అభిషేకము ధాన్యము, గృహ, గోవృద్దిని  కలిగించును.
  23. మామిడి పండ్ల రసము చేత అభిషేకము చేసిన దీర్ఘ వ్యాధులు నశించును.
  24. పసుపు నీటితో అభిషేకించిన మంగళ ప్రదము అగును - శుభ కార్యములు జరుగ గలవు.


Sunday, June 30, 2013

Shiva Stuthi




హస్తాభ్యాం కలశద్వయామృత రసైరాప్లావయంతం శిరో
ద్వాభ్యాం తౌ దధతం మ్రుగాక్షవలయే ద్వాభ్యాం వహన్తం పరమ్!
అంకస్యస్తకర ద్వయామృతఘటం కైలాసకాన్తమ్ శివమ్
స్వచ్చాంభోజగతం నవేందుముకుటం దేవమ్ త్రినెత్రమ్ భజే !!


తాత్పర్యం:
రెండు చేతులచే అమృత కలశాలను ఎత్తి పట్టుకొన్న వాడై,
మరో రెండు చేతులతో ఆ కలశామృతమును శిరస్సుపై పోసుకుంటున్న వాడై,
మరో  రెండు చేతులలో అక్షమాలను, మృగ ముద్రనూ కలిగిఉన్న వాడై,
మరో రెండు చేతులతో రెండు అమృత కలశాలను ఒడిలో పెట్టుకున్న వాడై,
కైలాస ప్రభువై స్వచ్చమైన కమలములపైన కూర్చొని ఉండి, 
బాలచంద్రుని శిరస్సున భూషణముగా కలిగి ఉన్నవాడైన త్రినేత్రునికి నమస్కరిస్తున్నాను.




Saturday, June 29, 2013

Kedarnath - Mahatmyam

Kedarnath Jyotirling Mahatmyam - Recent Floods

 (स्कंद्पुरण के अनुसार - केदारनाथ यात्रा के समय कोई मानव दर्शन करने से पहलेही रास्ते में मृत्यु हो गए थो वो पुण्यलोक प्राप्त करेग) 

Kedarnath Temple old Photo (Near 1900 )



Kedarnath Lingam


Mahaadri parshvecha thate ramantham, Sampoojyamaanam sathatham muneedraih !
Suraasurai yaksha mahora gaadhyai, Kedaara meesham shiva meesha meede !!


महाद्रि पार्शवेच थटे रमन्थम, सम्पूज्यमानाम सथथम मुनीन्द्रैः !
सुरासुरैयक्ष महोरगाध्यै, केदारमीषम शिवमीषा मीडे!!

శ్రీ కేదారనాథ్ లింగము జ్యోతిర్లింగాలలో అయిదవది. ఈ జ్యోతిర్లింగం స్వయంభువు - ప్రకృతి సిద్దంగా ఏర్పడినట్టిది. కేదారనాథ్ యొక్క సవిస్తార ప్రశస్తి స్కంద పురాణంలోని కేదారఖండంలో విస్తృతంగా వివరించబడింది. ఈ క్షేత్ర మహిమ వర్ణనాతీతం. కేదార శిఖరమున ఉండే ఈ దేవాలయమునకు పశ్చిమమున మందాకినీ నది, తూర్పున అలకనందా నదీ ప్రవహిస్తూ ఉంటుంది. మందాకినీ నది తీరంలో కేదారనాథ్ ఉండగా అలకనందా నదీ తీరాన బదరీనాథ మందిరం ఉంటుంది. రుద్రప్రయాగలో మందాకినీ మరియు అలకనందా  నదులు కలియును. ఇవి రెండు నదులూ కలిసి కొంత దూరం ప్రయాణించి దేవప్రయాగ దగ్గర భాగీరథి నదిలో (గంగా నది) కలిసిపోతాయి. గంగా నదిలో మునగటం వల్ల కేదారనాథ్, బద్రీనాథ్ ల చరణ కమలోదకంలో మునిగినట్లై పవిత్రులగు చున్నారు. 

హిమాలయాల్లో కొలువుండే ఈ జ్యోతిర్లింగాన్ని దర్శించిన మానవుడు తన జీవితాన్ని ధన్యం చేసుకున్న వాడవుతున్నాడు. ఈ లింగాన్ని దర్శించుకోవటం సంవత్సరంలో కేవలం కొన్ని నెలలు మాత్రమె (June-Sept/Oct) వీలవుతుంది. ఆపైన అక్కడ మంచు పెరుకుపోవటం వాళ్ళ వీలు పడదు. ఆ ప్రాంతమము అతి పవిత్రము - అక్కడ దేవతలు సంచరిస్తుంటారు అని ప్రతీతి - అందుకే పూర్వ కాలంలో అక్కడ నివాసాలు ఉండేవి కావు.


కాని ప్రస్తుత పరిస్థితి వేరు - అక్కడ నియమ నిబంధనలకు విరుద్దంగా జనావాసాలు వెలిసాయి - ప్రకృతినీ, పవిత్రతను పాడు చేసి వెక్కిరించాయి. ఫలితం 14 June 2013 న కట్టలు తెంచుకు ప్రవహించి ఉప్పొంగి ముంచెత్తి ఒక్క కేదారనాథ్ ఆలయం తప్ప అన్నింటినీ తుడిచి పెట్టిన మందాకినీ-అలకనందా నదీమ తల్లులు. ఎవరి స్వార్థానికి ఎవరు బలయ్యారో చెప్పలేం కాని కేదారనాథ్ దర్శనానికి వెళ్లి మరణించిన వారంతా పురాణవచనం ప్రకారం శివసాయుజ్యం చేరుకున్న పుణ్యాత్ములే. 

ఇక్కడ మరో చిత్రమేమంటే  సర్వం కొట్టుకుపోయినా కేదారేశ్వరుడు నందీశ్వర సమేతంగా నిలిచి ఉండటం ప్రళయ కాలంలోనూ మిగిలి ఉండేది పుట్టుక-చావుటలు లేని తను ఒక్కడే నని చెప్పటం కొరకేమో అని సామాన్య పామరులం గ్రహించుట కొరకేమో అనుకోవాలి.

दृष्ट्वा रूपम् नरस्यैच तथा नारयनस्यच !
केदारेश्वर साम्बश्च मुक्थिभागी न संशयः  !!     

अकृत्या दर्शनम् वैश्य केदारस्याघि नषिणः
यो गच्छेद् बदरीम तस्य यात्रा निष्पलतां भवेतः

केदरेशस्या भक्थाये मार्गस्था स्तस्यवै मृतः !
तेरी मुक्था भवन्त्येव दात्रा कार्य विचारणा !!      - Skandapuran


పై శ్లోకాల బట్టి తెలిసేదేమంటే కేదారనాథ్, బద్రినాథ్ లను దర్శించిన వారికి సమస్త పాపుములు నశించి జీవన్ముక్తి లభించును. ఎవరైనా కేవలం బద్రీనాథుని దర్శించి కేదారనాథుని దర్శించనిచో ఆ యాత్ర నిష్ఫలమగును. కేదార యాత్రకు బయలు దేరిన వారు మద్యలో మరనించినను (కేదారనాథుని దర్శనం కాకున్ననూ) పున్యలోకములను పొందును. 












Friday, June 28, 2013

Bhramrambaashtakam

శ్రీశైల భ్రమరాంబాష్టకం - తెలుగు
 Srishaila Bhramarambha Ashtakam Lyrics - Telugu



రవిసుదాకర వహ్నిలోచన రత్నకుండల భూషిణీ
ప్రవిమలంభుగ మమ్మునేలిన భక్తజన చింతామణి
అవని జనులకు కొంగు బంగారైన దైవ శిఖామణీ 
శివుని పట్టపురాణి గుణమని శ్రీగిరీ భ్రమరాంబికా

సోమశేఖర పల్లవాదరి సుందరీమణి ధీమణి
కోమలాంగి కృపాపయోనిధి కుటిల కుంతల ధీమణి
నామనంబున బాయకుండెటి నగకులేశ్వర నందనీ
సీమ లోపల వినుతి కెక్కిన శ్రీగిరీ భ్రమరాంభికా  

అక్షయంబుగ కాశిలోపల అన్నపూర్ణ భవానివై
సాక్షిగణపతి గన్నతల్లివి సద్గుణావతి శాంబవీ
మోక్షమోసగెటి కనక దుర్గవు మూలకారణ శక్తివై
శిక్షజేతువు క్రూరజనులను శ్రీగిరీ భ్రమరాంభికా

కలియుగంబున మానవులకూ కల్పతరువై యుండవా
వెలయు శ్రీగిరి శిఖరమందున వైభవముగా నుండియూ
అవనిలోపల భక్తజనులకు నవని దానంబివ్వవా
జిల్కు కుంకుమ కాంతి రీతులు శ్రీగిరీ భ్రమరాంభికా

భూతనాథుని వామభాగము పొందుగా చేకొంటివే
భ్రాంతిగా శ్రీశైలమందున ప్రకాశమై నివసించియూ
పాతకంబులు బారదోలుచు భక్తులను చేకొంటివే
రజితగిరిపై నుండి వెలసిన శ్రీగిరీ భ్రమరాంభికా

మీరు వెలసిన మీ ప్రభావము విష్ణులోకమునందునా  
మొల్లవించిన యింద్రలోకము బ్రహ్మలోకము నందునా
వెలమితో కైలాసమందున మూడు లోకములందునా  
చెల్లునమ్మా లోక పావన శ్రీగిరీ భ్రమరాంభికా

అంగ వంగ కళింగ కాశ్మీరాంధ్రదేశము నందునా
పొందుగా కర్ణాట కొంకణ పుణ్యభూముల యందునా
రంగుగా కర్నాట లాట మారాట దేశము నందునా
శృంగళా రాజ్యమున వెలసిన శ్రీగిరీ భ్రమరాంభికా


తరుణి శ్రీగిరి మల్లిఖార్జున దైవరాయుని బాలినీ
కరుణతో మమ్మేలు కొన్మిక కల్పవృక్షము భంగినీ
నిత్య మెప్పుడు అష్టకంబును వ్రాసి చదివిన వారికీ 
సిరుల నిచ్చుచు నుండ గోరెద శ్రీగిరీ భ్రమరాంభికా

ధరణిలోపల అష్టకంబును విన్నవారికి ఎప్పుడూ 
ఘాలి భూత పిశాచ బాధలు చేరకుండగ జూడుమీ 
ఇందునున్నా తప్పులెల్లను ఒప్పుగా భావించుమీ
నాదు  రక్షింప గోరెద శ్రీగిరీ భ్రమరాంభికా









Thursday, June 27, 2013

Srishaila Varnana

శ్రీశైల వర్ణనము 

Every Stone is Shivaling (a Shivaling Aakaar Nature Stones at Paladhara-Srishailam)


పాల్కురికి సోమనాథుని పండితారాధ్య చరిత్ర నుండి కొన్ని పంక్తులు 
Srishaila Varnana - Few Lines from "Panditaaradhya Charitra"







Thursday, June 13, 2013

Old Shiv Temple in Iran

I collected below matter from Vibhuthi 1940

(ప్రఖ్యాత విభూతి మాస పత్రిక పండిత చిదిరేమఠం వీరభద్ర శర్మ గారి సంపాదకత్వాన పలు సమత్సరాలు వెలువడినది. శ్రీవారు కాశీ జగద్గురు పీఠం అధిష్టించేవరకు వెలువడి అమోఘ వేద వేదాంగ సంబంధ శివతత్వ వెలుగుల ప్రసరింప జేసింది. ఆ పత్రిక వెలుగులు నేటికినీ అమూల్య జ్ఞాన కిరణాలే. )

This Ancient Temple was built in 1892 AD (hijri 1310)  (as per the Iran Tourism site.)

As per said by visited Article writers Mahesh Prasad, Moulani, Alim Fazil Temple Status in 1929:

This temple built by some of the Hindu Soldiers. Shivling Brought from India.
Puja done by Local Hindus. There is only 60-70 Hindu people. Nearly 8,000 Muslim Population is there.
Many Devotees visits Temple Daily.
In Puja time they play Bell, Taal, Mrudang, Shankh, Dhol - no one object about the voice.
The Temple area 18 acres and situated in middle of the Bandar Abbas Ancient City.
Sri Krishna, Anjaneya, Yogamaya idols also there.
There is a Sikh Gurudwara beside Shiv Temple.


To see information about Shiv Temple Go this Link:

http://www.itto.org/tourismattractions/?sight=429&name=Hindus+Temple#top


To know more about present Temple Status Go this Link:
http://historicaliran.blogspot.in/2010/09/hindu-temple.html

Iran Shiv Temple Photo Taken on  17-May-1929

About Iran Hindu Temple Shialay 



About Iran Hindu Temple Shivalay










Sunday, December 23, 2012

Shiva Panchakshari Stotram

శివ పంచాక్షరీ స్తోత్రం
శ్రీ ఆది శంకరాచార్య విరచితం




ఓంకార బిందు సంయుక్తం, నిత్యం ధ్యాయంతి యోగినః
కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః

ఓం నం నమంత  మునయస్సర్వే, నమంత్యప్సర సాంగణాః
నరాణామాది దేవానాం, నకారాయ నమో నమః

ఓం మం మహత్తత్వం మహాదేవ, ప్రియం జ్ఞానప్రదం  పరం
మహా పాపహరం తస్మాన్మకారాయ నమో నమః

ఓం శిం శివం శాంతం శివాకారం, శివానుగ్రహ కారణం
మహా పాప హరమ్ తస్మాచ్చికారాయ నమో నమః

ఓం  వాం వాహనమ్ వృషభోయస్య, వాసుకి: కరభుషణమ్
దామే శక్తి ధరం దేవం, వకారాయ నమో నమః

ఓం యం యకారే సంస్థితో దేవో, యకారం పరమమ్ శుభమ్
యం  నిత్యం పరమానందం, యకారాయ నమో నమః


యమ క్షీరాంబుధి మందవోద్భవ, మహా హాలాహలమ్ భీకరమ్
దృష్ట్వా తత్ర పలాయితాస్సురగణాన్నారాయణాదీన్థదా
నం పీత్వా పరిపాల యజ్జగదిదమ్, విశ్వాధికం శంకరం
సేవ్యోనస్సకలాపదామ్ పరిహారాణ్ కైలాసవాసే విభుమ్

షడక్షర మిదమ్ స్తోత్రం, యః పఠెచ్చివ సన్నిధౌ
తస్య మృత్యు భయమ్ నాస్తి హ్యప మృత్యు భయం కృతః
యత్క్రుత్యం తన్న కృత్యం, యదక్రుత్యమ్ కృత్యవత్తదా చరితమ్
ఉభయో: ప్రాయశ్చితం, శివ తవ నామాక్షర ద్వాయోచ్చరితం

శివ శివేతి శివెతి శివేతివా, భవ భవేతి భవెతివా
హర హరేతి హరేతి హరేతివా, భజ  మనశ్శివమేవ నిరంతరమ్


Rudrabhishekam - Deepa Vishishtatha



శివపూజ - దీప ప్రాముఖ్యత 





Deepa Pramukhyatha
Rudrabhisheka pujadow deepam prajjvala metyudheehi
akhanda deepa heenaayaa saa pooja nishphalam bhaveth    - Rudrakalpam

వివరణ: రుద్రాభిషేక సమయంలో దీపం ప్రజ్వలిస్తూ ఉండాలి. అఖండ దీపం ఆరిపోకుండా చూడాలి, ఒకవేళ ఆరిపోయిన ఆ పూజ నిష్ఫలము.


Vishishta Deepam

Kapilaadi ghruthanchaiva thila thailamadaapivaa
bilvaadi vruksha (tailaani) tailancha deepa thaila mihuchyathe        - Merutantra

వివరణ: రుద్రాభిషేక దీపానికై కపిల గోవు నెయ్యి, నువ్వుల నూనె, బిళ్వము లాంటి వృక్ష జాతుల నునె వాడాలి.



Nishedha Taila Deepam 

Eranda nimba tailaadeen varjayeth shivapoojane                - Merutantra


వివరణ: శివపూజలో  దీపమునకై ఆముదము, వేప నూనె, ఆవ నూనె, అవిశ నూనెలు వాడరాదు.



Deepa Phalam

Goghrutaath jnaana siddishcha moksha praapthi sthathahaparam
sampadvruddi yashovruddi thila thailamdaadaaticheth                      - Bhavishyapuran

వివరణ: ఆవు నెయ్యి జ్ఞాన సిద్ధిని మరియు అంత్యమున మోక్షమును, నువ్వుల నూనె సంపత్తును కీర్తి వృద్దిని ఇవ్వగలవు.



 Akhanda Deepa Pramaanam

Deepam saptaangulotyedam dharmamecchiva sannidhow

వివరణ: శివ సన్నిధిలో 7 అంగుళముల ఎత్తు అఖండ దీపం ఉంచాలి.

Uttamaajasya deepasyamaanam  saptaangulocchayam
madyamam tryangulam proktha, mekaangulyadhamam smrutham.

వివరణ: 7 అంగుళ ఎత్తు దీపం ఉత్తమం, 3 అంగుళముల దీపం మధ్యమం, 1 అంగుళ దీపం అధమంగా తెలియవలె.


ధాన్యం గాని, బియ్యం గాని పైన చెప్పిన ఎత్తుకు సరిపడునట్లు పోసి అందు పైన అఖండ దీప పాత్ర నుంచాలి.




Nandeeshwara Prastuthi

 Nandeeshwara Prastuthi




Vrusharajo mahatejo mahamegha samasyanaha
meru mandara kailasa himaadri shikharopama
sitabhra shikharaakaaram kakudaa parishobhithaha
maha bhogendra katvena valenacha virajitaha
raktaasya shrunga charano rakta praaya vilochanaha
peevaronnatha sarvaanga ssuchaaru gamanojvalaha
prashasta lakshana sreemaan prajvalan manibhushanaha
thathaa thaccharana nyaasa praapitho vara vigrahaha
goraaja purusha sreemaan sreemaan cchuta varaayudhaha
tamorajnam pusrutya samekaamaam prayacchatuhu


Nandeeshwaro mahaatejo nagendra tanayaatmajaha
sa naarayana kairdevair nitya mabhyarcha vandithaha
sharva svantha puradwari sambha parijanaih sthithaha
sarveshwara samaaprakhya ssarvaa sura vimardhanaha
sarveshaam shiva dharmaanaa madyakshatvebhishechitaha
shiva prayaha shivaasakta sree macchoola varaayudhaha





Wednesday, November 21, 2012

Srishailam

" Srishaila Shikharam Drushtvaa Punarjanma Na Vidhyate "

(My Srishailam Trip Pics)



Camera Photo from Shikhareshwaram  (4 Gopurams & in middle Mallikharjuna Swamy Temple Gharbhalaya Shikharam)



Shikhareshwaram


Shikhareshwaram - "Kailasa Drushyam"

Paladhara - Falling water looks like Milk


Panchadhara - here falling water taste really very sweet like sugar

Shivajigopuram (presently collapsed - I taken this photo before 10 days of collapse)

Beside Shivajigpuram  very beautiful Jaganmatha - Mahishasura Mardhini statue on Alaya Kudyam
Nallamala hills view
Srishailam Nallamala hills way - Risky Way
A Beautiful Travel - Srishailam





Nallamala Trees - "Karala Nrityam"
Patalaganga